Tollywood: పాన్ ఇండియా సినిమాల వల్ల లైఫే రిస్క్ చేస్తున్న హీరోలు.! అవును మన స్టార్ హీరోలు ఒకరిని మించి ఒకరు ఫ్యాన్స్ కోసం, క్రేజ్ కోసం చేస్తున్నవటువంటి సాహసాలు తమ లైఫ్ నే రిస్క్ లో పడేస్తున్నాయి. మరీ ముఖ్యంగా, బాహుబలి సిరీస్ నుంచి దర్శకులు ఇలాంటి సాహసాలను మన హీరోలతో చేయిస్తున్నారు.
కొన్నిసార్లు డూప్ లేకుండానే కొన్ని భారీ యాక్షన్ సీన్స్ లో నటించి కాళ్ళు, చేతులు విరగ్గొట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో రోప్స్ ఊడిపోయి ఎన్నో అడుగుల ఎత్తునుంచి కిందకి పడి ప్రాణాలను పోగొట్టుకునే స్థాయికి వచ్చినవారున్నారు. గత ఆరు నెలలలోనే రామ్ చరణ్, ఎన్‌టిర్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్..అంతకముందు ప్రభాస్ ఇలాంటి సాహసాలతో గాయాలపాలైయ్యారు.
ఇదంతా, కేవలం తమ అభిమానులను మెప్పించడానికే. వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారని అందరూ అనుకుంటారు. కానీ, దాని వెనకాల ఎన్ని కష్టాలుంటాయో ఊహించడం కష్టం. హీరోయిన్స్ కూడా ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ కోసం ఇలాగే ప్రాణాలను కూడా లెక్కచేయకుండా యాక్షన్ సీన్స్, కష్టమైన డాన్స్ మూవ్‌మెంట్స్ కోసం శ్రమించి శారీరకంగా నలిగిపోతున్నారు. అలాంటి, గాయం ఈ మధ్య రష్మిక మందన్న హిప్ కి అయింది.
ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత హీరోపైన ఎంత ఒత్తిడి ఉంటుందో మాటల్లో చెప్పలేము. గతంలో ఇలాంటి ఒత్తిడి ఉన్నా అది సినిమా రిలీజ్ ఒక్కదాని కోసమే ఉండేది. కానీ, ఇప్పుడు ఓటీటీ, శాటిలైట్ బిజినెస్, యూఎస్ మార్కెట్..ఇలా చాలా వాటి కోసం హీరోలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. అనుకున్న తేదీకి సినిమా రిలీజ్ కాకపోతే ఏకంగా ఓటీటీ డీల్ క్యాన్సిల్ కావడం లేదా అనుకున్న బడ్జెట్ తగ్గించడం జరుగుతున్నాయి. ఇదంతా కేవలం పాన్ ఇండియా సినిమా అనే ప్రస్టేజ్ వల్లనే అనక తప్పదు.












