- నోరు నెత్తిన పెట్టుకుని భూ దందా?
- పొజిషన్ లేకుండానే భూముల రిజిస్ట్రేషన్ చేయొచ్చని ఏ రెవెన్యూ చట్టం చెబుతోంది?
- నీ నోటి దూలకు భయపడే రోజులు పోయాయి దొరగారు?
- అర్బన్ సీలింగ్‌కు 15 కిలోమీటర్ల బఫర్ ఉన్నప్పుడు ఏ డిక్లరేషన్ ఇచ్చారు?
- ఈనాడు భూభారతిలో రిజిస్ట్రేషన్స్‌కు సమాధానం చెబుతారా?
- జీపీఏ చేసినవారు చనిపోతే చెల్లుతుందా?.. రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు?
- 5 పేజీల నోట్‌తో మీరు చేస్తున్న మనీ ల్యాండరింగ్ దందా ఏంటో బయటపెట్టాలా?
- ఎంత మందిని ఇందులోకి లాగుతున్నారో తెలుసా?
- బొమ్మరాసిపేట్‌లో 1,049 ఎకరాలపై 78 వయసులో ఫైట్ చేస్తున్నారని చెబుతున్నారు కదా..
- స్వేచ్చ న్యూస్ సవాల్ విసురుతోంది..
- జరిగిన 100 ఎకరాల భూ అక్రమ లావాదేవీలపై చర్చకు సిద్ధమా?
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
అది 1965వ సంవత్సరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన పేరు మోసిన నాయకుడు దుగ్గిరాల బలరామకృష్ణ తెలంగాణలోని మేడ్చల్ జిల్లా బొమ్మరాసిపేట్‌లో 1,049 ఎకరాలు కొనుగోలు చేశారు. నిజాం కాలంలో ఉండే చట్టం తెలియకుండానే ఇనాం ల్యాండ్ కూడా 255 ఎకరాలు ఇందులో సేల్ డీడ్ చేసుకున్నారు. ఏనాడు సేల్ డీడ్ టైటిల్‌ను డిక్లేర్ చేయలేదని సుప్రీంకోర్టు తీర్పులు ఎన్నో ఉన్నాయి.
1965 నుంచి 1966లో 21 మంది ఆనాటి బినామీల పేర్లపై సేల్ డీడ్స్ పార్టీషన్ చేశారు. రెవెన్యూ రికార్డుల్లో కూడా పేర్లు నమోదు అయ్యాయి. కానీ, పీవీ నర్సింహారావు భూ సంస్కరణలు తీసుకురావడంతో అంతా మారిపోయింది. బొమ్మరాసిపేట్ అర్బన్ సీలింగ్ యాక్ట్ కిందకు రాకపోయినా 15 కిలోమీటర్ల ఈనాటి భాషలో బఫర్ కిందకు వస్తుంది.
ఆనాడు రైతులకు సేల్ డీడ్స్ అంటే తెలియదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే అస్సలు గుర్తు ఉండదు. కనపడిన భూములు అన్నీ దున్నుకునేవారు. ఫార్టెస్ భూములకు సైతం 1985లోనే ప్రొటెక్షన్ తీసుకొచ్చారు. అలా 1981లో దున్నుకున్నారు. తెలంగాణ భూముల రక్షణ యాక్ట్ వస్తుందని తెలిసి 1965లో ఆనాటి ఎంపీ బినామీలు 20 మందికి 1,049 ఎకరాలు రికార్డులను మేనేజ్ చేసి మీర్ రెహమత్ అలీ, ఆరుగురు మీకు అమ్మకాలు జరిపారు.
అదే 1965లో జరిగిన రిజిస్ట్రటర్ సెల్ డీడ్స్ నుంచి ఫారెస్ట్ యాక్ట్స్ 1985 వరకు ఎలా పొజిషన్స్‌తో జరిగాయో, ఏ భూమి ఎవరికో తెలియదు. గ్రామంలో ఖాళీగా కనిపిస్తే దున్నుకుని జీవోనోపాదం చేసుకున్న రోజుల్లో 1966 తర్వాత నుంచి 1998 వరకు జరిగాయి. ఆనాడు ఆంధ్రా నుంచి వచ్చి ఈ భూమి సాగు చేశారని పహాణీలో ఉన్నాయా? మధ్యలో ఎన్నో భూ సంస్కరణలు వచ్చాయి. ఆప్పుడు ఎందుకు స్పందించలేదు.
ఈ 1,049 ఎకరాలపై ఈనాడు భూముల రేట్లు ఎకరం రూ.10 కోట్లు అయిందని ఆనాటి రిజిస్ట్రేషన్‌లోని 20 మందిలో వారసులు ఎవరు, వాళ్ల సర్టిపికేట్ ఏంటి? ఎంతమంది చనిపోయాక ఇప్పుడు ఈ దందా నడిపిస్తున్నారో చెబుతారా?
బీఆర్ఎస్‌లో పునాదులు
2007లో 10 ఎకరాల భూమికి చెందిన కేసుపై విచారణ జరుగుతోంది. అందులో ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను మాత్రమే పట్టుకుని, ఇప్పటికీ అందుబాటులో లేదని చెప్పే ఫైల్ నెంబర్ 2183/1999 పేర్కొంటారు. ఎప్పుడైనా ఏదైనా ఫైల్ నెంబర్‌కు ఫైలింగ్ చేసిన 1998 సంవత్సరం మాత్రమే వేస్తారు.
కానీ, ఆర్డర్ ఇచ్చిన సంవత్సరం పేరు వాడుకుంటారు. 50బీ సేల్ సర్టిఫికేట్స్ 1981లో ఇచ్చారు. పీటీలుగా ఉండాలంటే 1945 నుంచి 1960 వరకు ఏదైనా 10 ఏండ్లు ఉండాలని నిబంధన ఉంది. కానీ, పొజిషన్ కాలంలో కూడా భూమి అంతా ఆనాటి పట్టాదారుడి పేరుతోనే ఉంది.
దాంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసిపోయాక 1965లో దుగ్గిరాల బాలరామకృష్ణ తన బంధువుల పేర్లతో కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఎన్ని కేసులు జరిగినా ఎప్పుడు కూడా రెవెన్యూ యాక్ట్స్‌తో ఎవరూ ముట్టుకోలేదు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో తీసుకొచ్చిన వ్యవహారంతో 2023లో భూ బకాసురుడు, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అమోయ్ కుమార్ 40 పేజీల సుదీర్ఘ తీర్పు ఓ ఎమ్మెల్సీ లాబీయింగ్‌తో ఇప్పించారు.
ఇప్పుడు మీరు చేస్తోంది ఏంటి?
అమెరికాకు 60 ఏండ్ల క్రితం వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ సేల్ డీడ్ వారసులు ఉన్నారు అంటూ జీపీఏ హోల్డర్స్ పేరుతో ఆదిత్య యాదవ్‌ను తీసుకొచ్చి, నిత్యం రాజకీయ నీతులతో పాటు, ఎవరు ఎలా ఉండాలో చెప్పే గోనె ప్రకాశ్ రావు ఫైట్ చేస్తున్నట్లు స్వేచ్ఛ చైర్మన్ దేవేందర్ రెడ్డికి కొన్ని పేపర్స్ పంపారు.
వాటిలో నుంచి ఈనాటి వరకు జరుగుతున్న మనీ ల్యాండరింగ్ ఏంటి? ఎప్పుడు జీపీఏ చెల్లుతుంది? పొజిషన్ లేకుండా నాలా కన్వర్షన్ అయినా భూమిని ఎలా భూభారతిలో చేస్తున్నారు? ఓ మంత్రి కొడుకు ఫ్రెండ్స్‌కు ఇప్పుడు 10 ఎకరాలు అప్పగించారని ఎలా ప్రచారం జరుగుతోంది?
78 ఏండ్లకు ఇలా భూ బాగోతాన్ని తిమ్మిని బమ్మిని చేస్తే , దున్నే వాడిదే భూమి అనే సిద్దాంతం నమ్మే స్వేచ్ఛ ఏం కోరుకుంటుంది. గోనె ప్రకాశ్ రావు నీతులు చెప్పడం కాదు.. నిజాయితీ ఉంటే ఇప్పుడు చేస్తున్న భూ దందాపై ఆనాడు భూమి సునీల్, కొదండ రెడ్డిలు కాదు, ఓపెన్ చర్చకు స్వేచ్ఛ చైర్మన్ దేవేందర్ రెడ్డి సిద్ధం. వచ్చే ధైర్మం ఉందా?












