సినిమా

Ravi Teja: ‘ఇరుముడి’ తో ప్రయోగం..వర్కౌట్ అయితే అలాంటి కథలకి నో!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Ravi Teja: రవితేజ ఇంతకాలం తన మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఒకే రకమైన మూస ధోరణిలో సినిమాలను చేస్తూ వచ్చాడు. దాంతో, ఆ సినిమాలన్నీ ఫ్లాపవుతూ వచ్చాయి. అందుకే, ఇప్పుడు పూర్తిగా తన పంథా మార్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. గత చిత్రం భర్త మహాశయులకువిజ్ఞప్తి రెగ్యులర్ సినిమాలకి కాస్త భిన్నంగా ఎంచుకున్నాడు రవితేజ.

Ravi Teja: రవితేజ ఇంతకాలం తన మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఒకే రకమైన మూస ధోరణిలో సినిమాలను చేస్తూ వచ్చాడు. దాంతో, ఆ సినిమాలన్నీ ఫ్లాపవుతూ వచ్చాయి. అందుకే, ఇప్పుడు పూర్తిగా తన పంథా మార్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. గత చిత్రం భర్త మహాశయులకువిజ్ఞప్తి రెగ్యులర్ సినిమాలకి కాస్త భిన్నంగా ఎంచుకున్నాడు రవితేజ.

అయితే, కథ మాత్రం పూర్తిగా పాతది కావడంతో ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఫన్ అండ్ రొమాన్స్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం అందుకోవడంలో విఫలమైంది. ఈ క్రమంలో, బలమైన ఎమోషన్‌తో కంప్లీట్ ఫ్యామిలీ చిత్రాలను తీస్తున్న శివ నిరాణకి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇరుముడి చిత్రం చేశాడు.

ఈ సినిమా ఆగస్టు 21వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. అయితే, ఈ సినిమాలో ఎమోషన్స్, భక్తి ప్రధానాంశాలుగా ఉండబోతున్నాయి. తాజాగా, ఇరుముడి సినిమా నుంచి రెండవ పాట రిలీజైంది. ఈ పాట చూస్తే తండ్రీకూతుర్ల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా అని అర్థమవుతుంది. అంతేకాదు, రవితేజకి మందు అలవాటు ఉంటుంది. దానివల్ల భార్యతో కలహాలు..ఇతరులతో విబేధాలు..కీలకమైన సమయంలో ఆ వ్యసనాన్ని మానడానికి అయ్యప్ప దీక్ష తీసుకునే పాత్రలో రవితేజ నటిస్తున్నాడని క్లారిటీ వచ్చంది.

భార్య, భర్తల మధ్య చక్కటి సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ముఖ్యంగా రవితేజ, కూతురు పాత్రలో నటించిన నకాస్త్ర మధ్య వచ్చే ఫన్ అండ్ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయని కూడా తెలుస్తోంది. ఈ జానర్ గనక వర్కౌట్ అయితే, ఇకపై మన మాస్ మహా రాజ్ తన మాస్ కథలను పక్కనపెట్టి..ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథలను లైన్‌లో పెట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నాడని ఇన్‌సైడ్ టాక్. చూడాలి, మరి రవితేజలో ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏమేరకు సక్సెస్ ఇస్తుందో.

#raviteja#irumudi#shivanirvana#priyabhavanishankar#babynakasthra
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి
YouTubeలో చూడండి ↗

తర్వాత చదవండి