Nithin: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిడ్ రేంజ్ హీరోలలో నితిన్, నానిలకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ననై ఆల్రెడీ పాన్ ఇండియా స్కేల్ లో పాపులారిటీని తెచ్చుకున్నాడు. దసరా తో పాన్ ఇండియా వైడ్ గా హిట్ అందుకున్న నేచురల్ స్టార్, ఇప్పుడు ది ప్యారడైజ్ సినిమాను 7 భాషల్లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల కాలంలో ఇలా 7 భాషల్లో రిలీజ్ అయిన సినిమాలలో ప్యారడైజ్ ఉండటం గొప్ప విషయం.
ఇక, నాని తన సొంత బ్యానర్ లోనూ టాలెంటెడ్ డైరెక్టర్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ప్రశాంత్ వర్మ, శ్రీకాంత్ ఓదెల అలా వచ్చినవారే. ఈ లిస్ట్ లో మురళీకాంత్ కూడా చేరాడు. దండోరా సినిమాతో అభిరుచి గల దర్శకుడిగా ప్రశంసలు అందుకున్నాడు.

ఇప్పుడు నాని నిర్మాతగా, నితిన్ హీరోగా 'అలియాస్ రుక్మిణి' పేరుతో కొత్త చిత్రాన్ని తాజాగా ప్రారంభించారు. ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలవబోతోంది. నాని సోదరి దీప్తి గంట నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌గా వైష్ణవి చైతన్య, రుక్మిణి వసంత్ లలో ఒకరిని ఫైనల్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. కాగా, తాజాగా రిలీజైన కాన్సెప్ట్ గ్లింప్స్ బాగా ఆకట్టుకుంటోంది.
మూవీ ఓపెనింగ్ రోజునే కాన్సెప్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేయడం..దానికి నాని వాయిస్ ఓవర్..ప్లస్ అయి సినిమాపై ఆసక్తి కలగడంతో గ్యారెంటీగా నితిన్ కి ఈ సినిమా మంచి కంబ్యాక్ అవుతుందనిపిస్తోంది. నితిన్ లుక్ కూడా చాలా ట్రెండీగా ఉంది. ఇందులో, యూత్ స్టార్ రచయితగా కనిపించబోతున్నాడు. తన భార్య పేరుతో బుక్స్ రాస్తాడని గ్లింప్స్ లో హింట్ ఇచ్చారు. మరి, ఈ సినిమా నిర్మాతగా నానికి, హీరోగా నితిన్‌కి ఎలాంటి విజయాన్నిస్తుందో చూడాలి.












