National

Prashant Kishor: బీజేపీకి బిగ్ షాక్.. కమలం కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ ఘన విజయం

రచన: NK3 నిమిషాల పఠనం

Prashant Kishor: బిహార్ లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కమలం కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ ఘన విజయం సాధించారు. బిహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20వేల ఓట్లకుపైగా మెజార్టీతో ప్రశాంత్ కిశోర్ విజయం సాధించారు. బంకీపూర్ స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రాతినధ్యం వహించిన నియోజకవర్గం. అధిష్టానం ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వడంతో బంకీపూర్ లో ఉపఎన్నిక జరిగింది.

Prashant Kishor: బిహార్ లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కమలం కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ ఘన విజయం సాధించారు. బిహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20వేల ఓట్లకుపైగా మెజార్టీతో ప్రశాంత్ కిశోర్ విజయం సాధించారు. బంకీపూర్ స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. అధిష్టానం ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వడంతో బంకీపూర్ లో ఉపఎన్నిక జరిగింది.

ఇక్కడ 30 ఏళ్లుగా బీజేపీ గెలుస్తూ వస్తోంది. 1995 నుంచి బంకీపూర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ ఓడిపోలేదు. కమలం పార్టీ పూర్తి ఆధిపత్యం చాటింది. అలాంటి కంచుకోటలో బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చారు పీకే. కమలం కంచుకోటను బద్దలు కొట్టారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన పీకే.. విజయం సాధించారు. ప్రశాంత్ కిశోర్ ఘన విజయంతో పట్నాలోని జన్ సురాజ్ పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. జన్ సురాజ్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

#Prashant Kishor#Bjp#Bankipur#Bankipur Bypoll#Bankipur Bypoll Result#Jan Suraaj Party#Nitin Nabin#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి