NBK 112: గాడ్ ఆఫ్ నందమూరి బాలకృష్ణ తన 111, 112వ సినిమాలను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న ఎన్‌బీకే 111 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే భారీ యాక్షన్ సీక్వెన్సెస్ తెరకెక్కిస్తుండగా బాలయ్య మోకాలికి గాయం అయింది. దాంతో, హైదరాబాద్ కి చికిత్స నిమిత్తం షిఫ్ట్ చేశారు.
సర్జరీ తర్వాత డాక్టర్లు రెండు నెలలపాటు రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించారు. దాంతో, బాలయ్య చేస్తున్న రెండు సినిమాల ప్లానింగ్ మొత్తం మారిపోయింది. గోపీచంద్ మలినేని, ప్రస్తుతం బాలకృష్ణ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. గతంలో వీరిద్దరు కలిసి చేసిన వీరసింహారెడ్డి సినిమా మంచి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. దీంతో, ఎన్‌బీకే 111 ప్రకటించినప్పటి నుంచి అంచనాలు తారా స్థాయిలో పెరిగిపోయాయి.
ఇదే, క్రమంలో తన 112వ సినిమాను ప్రారంభించిన బాలయ్య సెట్స్ మీదకి తీసుకురావాలనుకున్నాడు. కొరటాల కూడా మొదటిసారి బాలయ్యను డైరెక్ట్ చేస్తుండటంతో ఎంతో ఎగ్జైట్‌గా ఫస్ట్ షెడ్యూన్‌ను ఈ నెల మూడవ వారం నుంచి ప్రారంభించాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ, ఇప్పుడు కొరటాల తన ప్లాన్ మార్చుకున్నాడట. నిన్నామొన్నటి వరకూ ముందు అనుకున్నట్టుగానే ఫస్ట్ షెడ్యూల్ బాలయ్య లేకుండా ఆగస్టు 3వ వారం నుంచి మొదలుపెట్టాలనుకున్నాడట.
కానీ, బాలయ్యతోనే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని ఇప్పుడు కొరటాల తన ప్లాన్ మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. మాస్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో చాలా పవర్ ఫుల్ స్టోరీగా ఈ సినిమా రానుందని సమాచారం. ఇక, ఐశ్వర్యరాజేష్ కీలక పాత్ర కోసం ఎంపికైనట్టుగా వార్తలు వచ్చాయి. ఇంకా, బాలయ్యకి జంటగా నటించే హీరోయిన్ ని ప్రకటించాల్సి ఉంది. కాగా, నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు.












