రాజకీయాలు

Prashant Kishor: వెంటనే పదవి నుంచి తొలగించండి.. రాత్రికి రాత్రే బెంగళూరుగా మారిపోదు.. ఘన విజయం తర్వాత పీకే సంచలనం

రచన: NK5 నిమిషాల పఠనం

బిహార్ రాష్ట్రంలో బీజేపీ కంచుకోట బద్దలైంది. కమలం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ ఘన విజయం సాధించారు. అఖండ విజయంతో 30 ఏళ్ల బీజేపీ అధిపత్యానికి తెరదించారు పీకే. ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాను చిత్తు చేశారు పీకే. తన విజయంపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. సంచలన డిమాండ్ ను తెరపైకి తెచ్చారు.

Prashant Kishor: బిహార్ రాష్ట్రంలో బీజేపీ కంచుకోట బద్దలైంది. కమలం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ ఘన విజయం సాధించారు. అఖండ విజయంతో 30 ఏళ్ల బీజేపీ అధిపత్యానికి తెరదించారు పీకే. ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాను చిత్తు చేశారు పీకే. తన విజయంపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. సంచలన డిమాండ్ ను తెరపైకి తెచ్చారు.

బంకీపూర్ లో నా గెలుపు బీజేపీకి ఒక సందేశం అన్నారు పీకే. బిహార్ ముఖ్యమంత్రిగా ఒక మంచి వ్యక్తిని ఎంపిక చేసుకోవాలనే సందేశాన్ని బంకీపూర్ ప్రజలు తమ తీర్పు ద్వారా బీజేపీ నాయకత్వానికి పంపారని వ్యాఖ్యానించారు. ఏ నాయకుడు లేదా ఏ పార్టీ అధికారంలో ఉందన్న దానికంటే రాష్ట్ర అభివృద్ధే అత్యంత ముఖ్యమని నొక్కి చెప్పారు.

''నేర చరిత్ర ఉన్న సామ్రాట్ చౌదరిని వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించండి. అతడి స్థానంలో మంచి వ్యక్తిని సీఎంగా నియమించండి. ఎవరిని ఎంపిక చేసినా అతడు సమర్థుడు, నిజాయితీ గల వ్యక్తి ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బిహార్ అభివృద్ధి చెందాలి. ఎవరు గెలిచారు? ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది? అన్నది ముఖ్యం కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. బిహార్ అభివృద్ధే అత్యంత ముఖ్యం'' అని పీకే అన్నారు.

బంకీపూర్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకోవడానికి, నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు పీకే. తాను పెద్ద పెద్ద హామీలు ఇవ్వాలనుకోవడం లేదన్నారు. ఇక, తాను ఎమ్మెల్యే అయనంత మాత్రాన బంకీపూర్ రాత్రికి రాత్రే బెంగళూరుగా మారిపోదని విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. కానీ రాబోయే రెండు మూడు నెలల్లోనే నియోజకవర్గంలో ప్రజలు మార్పులను గమనించడం మొదలుపెడతారని ఆయన హామీ ఇచ్చారు.

దాదాపు మూడు దశాబ్దాలుగా తమ పార్టీ ఆధీనంలో ఉన్న బంకీపూర్ నియోజకవర్గంలో బీజేపీని ఓడించి ఒక పెద్ద సంచలనం సృష్టించారు జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్. ఈ విజయం కిషోర్‌కు తొలి ఎన్నికల విజయం కాగా, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన జన్ సూరజ్ పార్టీకి ఇది బిహార్ అసెంబ్లీలో తొలి అడుగు వేయడానికి దోహదపడింది. దాదాపు రెండేళ్లుగా బీహార్‌లో కిషోర్ సాగించిన రాజకీయ ప్రస్థానానికి ఈ విజయం ఒక కిరీటంలా నిలిచింది. ఈ ప్రస్థానంలో ఆయన రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించి, జన్ సూరజ్‌ను ఒక రాజకీయ ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దారు. బీహార్‌లో ప్రతిపక్షం బలహీనపడిన నేపథ్యంలో, బంకీపూర్ విజయం కిషోర్‌కు, ఆయన పార్టీకి కొత్త రాజకీయ అవకాశాలను కల్పించింది.

#Prashant Kishor#Bjp#Bihar#Bankipur#Bankupur Bypoll Result#Jan Suraaj Party#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి