సినిమా

Samantha: ఫస్ట్ బేబీ బంప్‌తో సమంత పిక్స్ వైరల్

రచన: Anshu3 నిమిషాల పఠనం

Samantha: టాలీవుడ్ లో సమంతకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తన కెరీర్ గురించి మాట్లాడుకుంటే..ఒక ప్రత్యేకమైన జర్నీ ఆమెది. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. 500 రూపాయల కోసం ఫంక్షన్స్ లో వెల్కం గర్ల్ గా పనిచేసిన ఆమెకి సీనియర్ దర్శకుడు గీతా కృష్ణ ఇచ్చిన యాడ్ ఫిల్మ్ ఛాన్స్ ఈరోజు స్టార్ హీరోయిన్‌గా వెలగడానికి కారణం అయింది.

మొదటి సినిమా 'ఏ మాయ చేశావే'..ఈ సినిమాతో సౌత్ మొత్తం ఆకట్టుకుంది. ఇక, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అదే, హీరో అక్కినేని నాగ చైతన్యతో ప్రేమ..రెండు మత సాంప్రదాయాల ప్రకారం ఘనంగా పెళ్ళి..ఆ తర్వాత కొన్నేళ్లకి విడాకులు. ఇదంతా సమంత లైఫ్‌లో అలా జరిగిపోయింది. విడాకుల తర్వాత ఎన్నో అవమానాలు..ఆరోగ్య సమస్యలు.

ఇవన్నీ తట్టుకొని మళ్ళీ నిలబడింది. దర్శక నిర్మాత రాజ్ నిడిమోరుతో రెండవ వివాహం జరిగిన తర్వాత సమంత లైఫ్ ఊహల పల్లకిలో తేలిపోతోంది. ఇటీవలే, తన భర్త సపోర్ట్ తో బి.వి.నందిని రెడ్డి దర్శకత్వంలో 'మా ఇంటి బంగారం' సినిమాతో సాలీడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఈ సినిమా సమంత కెరీర్‌లో ఎంతో ప్రత్యేకం కూడా. ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ లో 100 కోట్లు మార్క్ చేరుకుంది ఈ సినిమా.

అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో సమంత ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. మళ్ళీ మెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నాని.. తన ప్రగ్నెన్సీని కన్‌ఫర్మ్ చేసింది. తాజాగా, ఫట్ బేబీ బంప్ పిక్స్‌తో అల్ట్రా స్టైలిష్ ఫొటో షూట్స్ కి సంబందించిన పిక్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ చూసిన సమంత ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాదు, ఈ పిక్స్ తెగ షేర్ చేస్తూ ఫస్ట్ బేబీ బంప్‌తో మా బంగారం మెరిసిపోతుందంటున్నారు.

#samantha#rajnidimoru#samanthababybump#viralnews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి