క్రైమ్

Crime : అమెరికాలో ఏపీ యువతి మరణంలో ట్విస్ట్.. రూ.1400 కోట్ల స్కాంకు లింక్?

రచన: Kumar3 నిమిషాల పఠనం

అమెరికాలో ఏపీ యువతి ప్రసన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో భారీ ట్విస్టు వెలుగుచూసింది. ఆ యువతి మరణానికి రూ.1400 కోట్ల కుంభకోణానికి సంబంధించి లింక్ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

అమెరికాలో ఏపీ యువతి ప్రసన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో భారీ ట్విస్టు వెలుగుచూసింది. ఆ యువతి మరణానికి రూ.1400 కోట్ల కుంభకోణానికి సంబంధించి లింక్ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి వసంతరావు, మల్లీశ్వరి దంపతుల కుమార్తె ప్రసన్న.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. అక్కడ చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్టు సమాచారం. కాగా, ఇటీవల ఆమె అమెరికాలోనే ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.

కాగా, ఆమె మృతితో రూ.1400 కోట్ల స్కాంకు లింక్ ఉన్నట్టు పోలీసులు అనుమానించడం కొత్త చర్చకు తెరలేపింది. షేక్ బజార్ కిసాన్ పరివార్ పేరుతో భూపాల్ నాయక్ అనే వ్యక్తి మరికొందరు అమాయకుల నుంచి పెద్దఎత్తున డిపాజిట్లు సేకరించి మోసం చేయగా.. ఈ కంపెనీకి డైరెక్టర్‌గా ఒప్పంద పత్రాల్లో ప్రసన్న సంతకం చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడు

భూపాల్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గుజరాత్ పోలీసులు తెలిపారు. కాగా, ఈ స్కామ్‌కు మరణించిన ఏపీ యువతికి ఏంటి సంబంధం? ఆ కంపెనీకి ప్రసన్న డైరెక్టర్‌గా ఎందుకు సంతకం చేసింది? ఆమెది ప్రమాదం కాదా? ప్లాన్ ప్రకారమే కారుతో గుద్ది హత్య చేశారా? అని కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి.

https://x.com/TeluguScribe/status/2075441150538981458?s=20

#ap girl#dead#america#bigscam#india#common link
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి