క్రైమ్

Crime : గంజాయి,లవర్.. యువకుడి మర్మాంగాలు నలిపి చంపిన ఫ్రెండ్స్!

రచన: Kumar3 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం వెలుగుచూసింది. గంజాయి వ్యాపారంలో గొడవలు, తన లవర్‌కు అసభ్యకరంగా మెసెజెస్ చేస్తున్నాడని తోటి స్నేహితుడిని.. మిగతా ఫ్రెండ్స్ సాయంతో ఓ వ్యక్తి హతమార్చాడు.

హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం వెలుగుచూసింది. గంజాయి వ్యాపారంలో గొడవలు, తన లవర్‌కు అసభ్యకరంగా మెసెజెస్ చేస్తున్నాడని తోటి స్నేహితుడిని.. మిగతా ఫ్రెండ్స్ సాయంతో ఓ వ్యక్తి హతమార్చాడు. యువకుడి మర్మాంగాలు నలిపివేసి చనిపోయే వరకు దాడి చేసి ఆ తర్వాత మృతదేహాన్ని అక్కడే వదిలేసినట్టు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే.. నిషాని సుహాస్(22) అనే యువకుడు గంజాయికి బానిసయ్యాడు.

గతంలో సికింద్రాబాద్ ప్రాంతంలో తన తల్లి,సోదరితో కలిసి నివాసం ఉండేవాడు. తన భర్త చనిపోవడంతో కూతురు పెళ్లి చేసిన సుహాస్ తల్లి.. కొడుకు తప్పుదారి పడుతున్నాడని గమనించి పసుమాములలో సొంత ఇల్లు కొని అక్కడికి మకాం మార్చింది.అయితే, సుహాస్ వద్ద ఫోన్ లేకపోవడంతో తన స్నేహితులు రాకేష్, పరుశురాం, రాజులలో ఒకరి ఫోన్ తీసుకొని, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అతని లవర్‌కు అసభ్యకర మెసేజెస్ పంపడం మొదలెట్టాడు. సదరు యువతి ఈ విషయాన్ని తన బాయ్ ఫ్రెండ్‌కు చెప్పడంతో, సుహాస్‌ను హతమార్చాలని ముందే మాట్లాడుకుని అతని స్నేహితులు నిర్ణయించుకున్నారు.

గతంలో గంజాయి వ్యాపారంలో వారి మధ్య ఉన్న లావాదేవీల వివాదాలు బయటికి తీసి, సుహాస్‌తో గొడవ పెట్టుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున పసుమాముల వెళ్లి మాట్లాడాలని సుహాస్‌ను ఊరి శివారులో ఉన్న మర్రి చెట్టు వద్దకు తీసుకెళ్లారు. అనంతరం రాకేష్, పరుశురాం, రాజు, మరో వ్యక్తి దాడి చేశారు. సుహాస్ భయంతో పారిపోతున్నా వదలకుండా, వెంటపడి అతని మర్మాంగాలు నలిపి చనిపోయేవరకు కొట్టి, అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. సుహాస్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసి, ఇతరుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

https://x.com/TeluguScribe/status/2075438916019392757?s=20

#murder#friends#hyderabad#weed business#love issue
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి