National

Ayodya : విరాళాల చోరీ డబ్బుతో వడ్డీ వ్యాపారం.. ఇంట్లో డబ్బుల కట్టలు, బంగారం!

రచన: Kumar3 నిమిషాల పఠనం

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో తవ్వకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో యూపీ సిట్ అధికారులు మరింత దూకుడు పెంచారు.. నిందితుడు అవినాశ్ శుక్లా, అతన్ని చోరీ మిత్ర బృందాన్ని విచారిస్తున్నారు.

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో తవ్వకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో యూపీ సిట్ అధికారులు మరింత దూకుడు పెంచారు.. నిందితుడు అవినాశ్ శుక్లా, అతన్ని చోరీ మిత్ర బృందాన్ని విచారిస్తున్నారు. అవినాశ్ నగదు విరాళాలను లెక్కించేందుకు రూ.15 వేల జీతంతో చేరి 70 సార్లు విరాళాలు దొంగతనం చేసినట్టు సిట్ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.

తాజాగా మరిన్ని విషయాలను వెల్లడించారు. అవినాశ్ శుక్లా దొంగిలించిన దేవుడి సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు.కీలక నిందితులు అన్‌కల్ప్ మిశ్ర, లవ్‌కుష్ మిశ్ర, కరుణేష్ పాండే ఇండ్లల్లో తనిఖీలు నిర్వహించగా డబ్బుల కట్టలు, బంగారు ఆభరణాలు, కారును గుర్తించి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే, నిందితులు విరాళాల సొమ్మును చోరీ చేసి ఆ డబ్బులతో వడ్డీ వ్యాపారం, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, నిందితులకు చెందిన బంధువుల బ్యాంకు ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు జమ అయినట్టు కూడా గుర్తించి.30 ఖాతాలను జప్తు చేసినట్టు సిట్ వెల్లడించింది. కాగా, నిందితులను కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

https://x.com/TeluguScribe/status/2075445490473427059?s=20

#ayodya temple#donations#scam#money lending business#stockmarket
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి