National

Sikkim : టన్నెల్ డిజాస్టర్.. 22 మృతదేహాల వెలికితీత..

రచన: Kumar3 నిమిషాల పఠనం

సిక్కిం రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. నిర్మాణంలో టన్నెల్‌లో కొండచరియలు విరిగిపడటంతో అందులో పనిచేస్తున్న కార్మికులు.. విగతజీవులుగా మారారు.

సిక్కిం రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. నిర్మాణంలో టన్నెల్‌లో కొండచరియలు విరిగిపడటంతో అందులో పనిచేస్తున్న కార్మికులు.. విగతజీవులుగా మారారు. సిక్కింలోని నామ్‌చి జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకోగా..సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాల వెలికితీత కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది.

ప్రకృతి విపత్తు కారణంగా నిర్మాణంలోని ఎన్‌హెచ్‌పీసీ (NHPC) తీస్తా స్టేజ్-VI హైడ్రో పవర్ ప్రాజెక్ట్ టన్నెల్ కూలిన ఘటనలో ఇప్పటివరకు 22 మంది కార్మికులు మృతిచెందారు. వాటిని వెలికితీసినట్టు అధికారులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో టన్నెల్ లోపల మీథేన్ గ్యాస్ పేలుడు సంభవించడంతో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలిపోయినట్టు తెలుస్తోంది.

మరోవైపు ప్రకృతి విపత్తు కారణంగా టన్నెల్ ప్రమాదం సంభవించినట్టు కథనాలు వస్తున్నాయి.అయితే, ప్రమాదం సంభవించిన మొత్తం 25 మంది కార్మికులు లోపల చిక్కుకుపోగా.. టన్నెల్ లోపల చిక్కుకున్న మరో ముగ్గురు కార్మికులను గుర్తించి వెలికితీసేందుకు స్పెషల్ ఫోర్సెస్ సహాయక చర్యలను వేగవంతం చేశాయి. ఈ ఘటనపై అటు సిక్కిం ప్రభుత్వం, ప్రధాని మోడీ, పలువురు ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు.

ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.అదే విధంగా సిక్కిం ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం అందిస్తామని ఎన్‌హెచ్‌పీసీ కూడా ప్రకటించింది.

#Sikkim#tunnel accident#22 dead bodies#recovered#Crime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి