వ్యాపారం

AI Effect: ‘ఏఐ’ తెచ్చిన తంటా.. ఉబెర్‌లో 10శాతం ఉద్యోగుల తొలగింపు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

రైడ్-హెయిలింగ్ దిగ్గజం ఉబెర్ టెక్నాలజీస్(Uber) తమ కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంచే క్రమంలో ఉద్యోగాల కోత విధించింది. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో కస్టమర్ సర్వీస్(కమ్యూనిటీ ఆపరేషన్స్) విభాగంలో దాదాపు 10శాతం మంది ఉద్యోగులపై వేటు వేసింది.

రైడ్-హెయిలింగ్ దిగ్గజం ఉబెర్ టెక్నాలజీస్(Uber) తమ కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంచే క్రమంలో ఉద్యోగాల కోత విధించింది. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో కస్టమర్ సర్వీస్(కమ్యూనిటీ ఆపరేషన్స్) విభాగంలో దాదాపు 10శాతం మంది ఉద్యోగులపై వేటు వేసింది.

నెక్స్ట్-జనరేషన్ ఏఐ సాంకేతికతలను విస్తృతంగా వాడుకోవడానికి ప్రస్తుతం ఉన్న విభాగాల నిర్మాణం ఆటంకంగా మారిందని, అందుకే ఈ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టినట్లు కంపెనీ అంతర్గత వర్గాల ద్వారా సమాచారం. ఏఐ రాక కారణాన్ని చూపిస్తూ ఉబెర్ ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా, ఉబెర్ ఈ తరహా చర్యలు చేపట్టడం ఇదేమీ మొదటిసారి కాదు. గత జూన్ నెలలోనే కంపెనీ తన పీపుల్ డివిజన్‌లోని 23 శాతం మంది సిబ్బందిని సాగనంపింది.

అయితే, ఒకవైపు ఏఐ విస్తరణ వల్ల సాధారణ నియామకాల వేగం తగ్గుతుందని స్పష్టం చేసినప్పటికీ, మరోవైపు అటానమస్ మొబిలిటీ, రోబోట్యాక్సీ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన ఇంజనీరింగ్ విభాగాల్లో దాదాపు 500కు పైగా కొత్త ఉద్యోగ ఖాళీలను ప్రకటించడం గమనార్హం. అలాగే, కస్టమర్ సర్వీస్ విభాగంలో ఉన్న రిమోట్ ఉద్యోగులంతా నిర్దేశిత హబ్ కార్యాలయాలకు వెంటనే మారాలని యాజమాన్యం ఆదేశించింది.

గ్లోబల్ టెక్ రంగంలో గత కొన్ని నెలలుగా తీవ్రంగా కొనసాగుతున్న లేఆఫ్స్ ట్రెండ్‌లో ఉబెర్ నిర్ణయం కూడా ఒక భాగమే. ప్రముఖ లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ (Layoff.fyi) నివేదిక ప్రకారం, 2026 మొదటి ఐదు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,16,739 మంది టెక్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. మెటా, క్లౌడ్‌ఫ్లేర్, పేపాల్, సిస్కో, క్వోరా, కాయిన్‌బేస్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఖర్చుల తగ్గింపు, ఏఐ ప్రాధాన్యతలు, పునర్‌వ్యవస్థీకరణ పేరిట భారీగా ఉద్యోగులకు గుడ్ బై చెప్తున్నాయి. మొత్తానికి ఏఐ ప్రభావంతో టెక్ రంగంలో ఉద్యోగ భద్రత తీవ్ర ప్రశ్నార్థకంగా మారుతోంది.

#Uber Layoffs#AI Impact on Jobs#Uber Customer Support#Tech Layoffs 2026#Uber Technologies#Job Cuts in Tech#Artificial Intelligence#Layoffs FYI
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి