Ranabaali: కొందరు హీరోలకి క్రేజ్ మామూలుగా ఉండదు. వరుసగా ఫ్లాప్స్ వస్తున్నా..బాక్సాఫీస్ వద్ద అదే ఊపు కనిపిస్తునంది. అలాంటి హీరోలలో రౌడీ హీరోగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండ ఒకరు. ఆయన నటించిన గత చిత్రాలు కింగ్‌డం, ఫ్యామిలీ స్టార్, ఖుషి, లైగర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే.
అయినా కూడా విజయ్ కి అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తన చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి రౌడీ జనార్ధన..మరోటి రణబాలి. ఈ సినిమాని దర్శకుడు టాక్సీవాలా సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పాపులర్ అయిన రాహుల్ సాంకృత్యన్ రూపొందిస్తున్నాడు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌గా నేషనల్ క్రష్..రష్మిక మందన్న నటిస్తుండటం గొప్ప విశేషం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి గీతగోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలలో నటించారు. గీతగోవిందం భారీ హిట్ సాధించగా, డియర్ కామ్రేడ్ మాత్రం ఫ్లాపైంది. అయితే, సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం వీరి జంటకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
అందుకే, దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ విజయ్-రష్మిక లతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు. అయితే, రణబాలి చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో అనుకున్న డేట్ కి రణబాలి రిలీజ్ కాకపోవచ్చునని అంటున్నారు. డిసెంబర్ కి షిఫ్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట. అదే, జరిగితే రౌడీ జనార్ధన సినిమా విడుదల కూడా ఆలస్యం కావచ్చు.












