నీట్ పేపర్ లీకేజీ అంశంలో బాధ్యత వహిస్తూ కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. రెండు వారాలుగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. గత మూడ్రోజులుగా ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాయి. అంతకుముందు సామాజిక వేత సోనమ్ వాంగుచుక్ ఆమరణ నిరహార దీక్ష చేపట్టి శాంతియుతంగా నిరసన తెలిపారు.
పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజున.. సీజేపీ, సోనమ్ వాంగ్ చుక్ పార్లమెంట్ ముట్టడికి పిలుపునివ్వడం.. విద్యార్థుల మీద పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఉద్యమం కాస్త ఉగ్రరూపం దాల్చింది. నిన్న రాత్రికూడా ఇంటర్నెట్ బంద్ చేయడంతో విద్యార్థులు పోలీసుల మీదకు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.కాగా, నేటి ఉదయం ప్రధాని మోడీ ట్వీట్ ద్వారా.. పేపర్ లీకేజీలు జరగకుండా, బాధ్యులను కఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
తాజాగా ప్రధానిమోడీ ప్రకటనపై సీజీపీ జాతీయ ప్రతినిధి అశుతోష్ రంకా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘పేపర్ లీక్ అయ్యాక చర్యలు తీసుకోవడం కంటే, లీక్ అవ్వకుండా చర్యలు తీసుకోవడం మంచిది. నెలన్నర రోజుల విద్యార్థుల నిరసన తర్వాత మోడీ తీరిగ్గా స్పందించారు.పేపర్ లీక్ జరిగిన తర్వాత శిక్షలు విధించడం వల్ల సమస్య పరిష్కారం కాదని, అసలు పేపర్ లీక్‌లు ఎందుకు జరుగుతున్నాయో సమాధానం చెప్పాలి.
https://x.com/TeluguScribe/status/2080159831609237760?s=20
గాయం అయిన తర్వాత మందు రాయడం కాదు, అసలు గాయం కాకుండా చూడటమే ముఖ్యం.వ్యవస్థను నడిపిస్తున్న వారికి జవాబుదారీతనం, సమర్థత లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లేది లేదు’అని స్పష్టంచేశారు.












