ఏపీ

TTD : తిరుమలలో దారుణం.. ఘాట్ రోడ్‌లో అంజనేయ స్వామి విగ్రహం చోరీ

రచన: Kumar3 నిమిషాల పఠనం

ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది.హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఇటీవల కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వ్యవహరిస్తున్నారు.దైవంగా ఆరాధించే దేవుడి విగ్రహాలను ఎత్తుకెళ్లడం, ధ్వంసం చేయడం వంటివి చేస్తున్నారు.

ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది.హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఇటీవల కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వ్యవహరిస్తున్నారు.దైవంగా ఆరాధించే దేవుడి విగ్రహాలను ఎత్తుకెళ్లడం, ధ్వంసం చేయడం వంటివి చేస్తున్నారు.ఫలితంగా రెండు వర్గాల మధ్య గొడవలు జరిగేలా వ్యవహరిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా పవిత్రపుణ్యక్షేత్రం తిరుమలలో ఆంజనేయ స్వామి వారి విగ్రహం కనిపించకుండా పోయింది.

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్టు సమాచారం.నిత్య పూజలు అందుకునే విగ్రహాన్ని అర్థరాత్రి వేళ దుండగులు దొంగిలించారు.పవిత్ర పుణ్యక్షేత్రంలో విగ్రహం చోరీకి గురికావడంపై భక్తుల తీవ్ర ఆందోళన, దిగ్భ్రాంతికి గురయ్యారు. నిత్యం సెక్యూరిటీ చోట ఇలాంటి ఘటన ఎలా జరిగిందని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే ఘాట్ రోడ్ గుండా 24 గంటలు వాహనాలు సంచరిస్తుంటాయి.

https://x.com/RTVnewsnetwork/status/2079845544000717204?s=20

భక్తులు సైతం మెట్ల మార్గం గుండా వెళ్తూ ఘాట్ రోడ్స్ ఎక్కుతుంటారు. అక్కడే ఉండే ఆంజనేయస్వామికి దండం పెట్టుకుని శ్రీవారి దర్శనం కోసం కొండకు పయనం అవుతుంటారు. పక్కా ప్లాన్ ప్రకారమే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా, ప్రభుత్వం పరువు పోయేలా చేయడానికి దుండగులు ఇలాంటి పనిచేశారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనతో తిరుమల దేవస్థాన భద్రతా వ్యవస్థపై పలు అనుమానాలు తలెత్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విగ్రహం కోసం గాలిస్తున్నట్టు తెలుస్తోంది.

#Anjaneyaswami idol#theft#tirumala ghat road#Andrapradesh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి