విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్రమోడీ గురువారం ఉదయం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టిన విషయం తెలిసిందే.ఇకమీదట పేపర్ లీకేజీలు కాకుండా చూసుకుంటామని, అలాంటి కేసులను త్వరగా విచారించి దోషులకు శిక్ష పడేలా చేసేందుకు దేశంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ఆయన ట్వీట్ సారంశం. అయితే, మోడీకి ట్వీట్‌కు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
దేశ యువత భవిష్యత్‌ను తీవ్రంగా దెబ్బతీసేందే మీరు అంటూ రిప్లయ్ ఇచ్చారు. విద్యావ్యవస్థను పూర్తిగా గుప్పిట్లో పెట్టుకుని నాశనం చేసేలా అనుమతి ఇచ్చారని, అలాంటి వారిని ప్రోత్సహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ ఘటనలో బాధ్యలైన ప్రతి ఒక్కరినీ మీరే కాపాడారంటూ ఆరోపించారు.విద్యార్థుల డిమాడ్లు స్పష్టంగా ఉన్నాయని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మరోసారి ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
అంతేకాకుండా, విద్యార్థులకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలన్నారు. నిరసనకారులపై దాడి చేసిన వారిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. మోడీ ముందు రాహుల్.. మూడు ప్రధాన డిమాండ్లను ఉంచారు. మోడీ చేసిన ట్వీట్‌లో కేవలం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు వెంటనే శిక్ష పడేలా చూస్తామని మాత్రమే హామీ ఇచ్చారని..
విద్యార్థులు చేస్తున్న నిరసనలో స్పష్టంగా పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని.. దాని మీద ప్రధాని ఎందుకు స్పందించలేదని అడిగారు. కాగా, కేంద్రమంత్రి రాజీనామా విషయంలో కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనకు క్రమంగా ఇతర పార్టీల మద్దతు పెరుగుతోంది.












