సినిమా

Sreeleela: మరో బ్లాక్ బస్టర్ మిస్ చేస్తున్న డాన్సింగ్ క్వీన్?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Sreeleela: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డాన్సింగ్ క్వీన్ గా శ్రీలీలకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కానీ, ఆమె ఖాతాలో సాలీడ్ హిట్స్ కనీసం 5 సినిమాలు కూడా లేవు. కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా పరిచయమైనప్పటికీ, తెలుగులో బాగా క్రేజ్ వచ్చింది..ఎక్కువగా సినిమాలు చేసింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది.

ధమాకా సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాపైయ్యాయి. మధ్యలో నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా ఒకటి హిట్ గా నిలిచింది. వరుస ఫ్లాపులొచ్చాయి. చేసిన సినిమాలు పెద్ద సంస్థలలో, పెద్ద హీరోలతో, పెద్ద దర్శకులతో చేసింది. అయినా, కూడా సాలీడ్ దక్కలేదు.

దీంతో, గత కొన్నిరోజులుగా శ్రీలీలకి అవకాశాలు రావడం లేదు. ఇటీవల వచ్చిన అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. నిర్మాతలు బాగానే లాభాలను చూశారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అయితే, ఈ సినిమాలో వాస్తవానికి శ్రీలీలకి అవకాశం వచ్చింది. కొన్ని సీన్ కూడా షూట్ చేశారు. కానీ, కొన్ని కారణాల వల్ల శ్రీలీల తప్పుకుంది. లేకపోతే, లెనిన్ సినిమాతో మంచి హిట్ అందుకునేది.

ఇదే, సినిమా కాదు తాజా సమాచారం మేరకు..తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి నటించిన జననాయగన్ సినిమాలో కూడా శ్రీలీల నటించాల్సి ఉందట. ఈ విషయాన్ని దర్శకుడు హెచ్.వినోద్ స్వయంగా తెలిపారు. భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల పాత్ర హైలెట్ అవడంతో..జన నాయగన్ లోనూ తీసుకోవాలనుకున్నారట. తనతో పాటు మరి కొంతమందిని పరిశీలించి ఫైనల్ గా మమితా బైజు ని తీసుకున్నారు. గ్యారెంటీగా జన నాయగన్ భారీ హిట్ అనే టాక్ ఆల్రెడీ వచ్చేసింది. కాబట్టి, రీలీల ఖాతాలో చేరాల్సిన భారీ హిట్ మమితా బైజు కి వెళ్ళిందని చెప్పొచ్చు.

#sreeleela#vijaythalapathy#jananayagan#bhagavanthkesari
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి