సమాజంలో మానవత్వం మంటగలిసి పోతున్నది. తల్లి తర్వాత తల్లిలా చూసుకోవాల్సిన అత్తపై ఓ కోడలు పగ పెంచుకుంది. ఆమె మీద పైశాచిక దాడులకు పాల్పడింది. ఆస్తి వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. దీంతో అత్తను అంతమొందించాలని కోడల్ ప్లాన్ చేసినట్టు సమాచారం.ఈ క్రమంలోనే అత్త మీద తీవ్రంగా దాడి చేయడంతో పాటు కత్తితో పొడిచింది. హైదరాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకివెళితే.. దేవరై పద్మావతి(57), కోడలు విజయలక్ష్మి (33) మధ్య చాలా కాలం నుంచి ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం మరోసారి గొడవ జరగ్గా.. అత్తను కత్తితో దాడి చేసి చంపాలని కోడలు ప్రయత్నించినట్టు తెలిసింది. ఆమెను జుట్టు పట్టుకుని ఇంటి లోపలికి లాక్కెళ్లి, కూరగాయలు కోసే కత్తి తీసుకుని పద్మావతిపై దాడి చేసింది.బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నఇరుగుపొరుగు వారు బాధితురాలని రక్షించారు.
https://x.com/pulsenewsbreak/status/2079962591255031943?s=20
పద్మావతి మెడ, చేతి భాగాలపై తీవ్ర గాయాలు.. చికిత్స నిమిత్తం వెంటనే ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. హత్యాయత్నం కింద కోడలు విజయలక్ష్మిని అదుపులోకి తీసుకొన్న చిలకలగూడ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కోడలు అత్త మీద కత్తితో దాడి చేస్తున్న దృశ్యాలు ఇంట్లోని సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.దాడి అనంతరం ఫ్లోర్ మీద నెత్తిటి మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.












