సినిమా

Trivikram: వెంకటేష్ లాంటి హీరోతో ఇలాంటి సినిమా తీస్తారా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Trivikram: నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలను చూస్తే ఠక్కున గుర్తొచ్చేది ముందు వెంకటేష్..తర్వాత దర్శకరచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ రెండు సినిమాలకి ఆయన కథ-మాటలు అందించారు. దానికి, వెంకీ కామెడీ టైమింగ్, పర్ఫార్మెన్స్‌తో హిట్ కొట్టాడు. అప్పటి నుంచి త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ హీరోగా సినిమాలు ఎప్పుడు వస్తుందో..అని ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూశారు. ఎట్టకేలకి ఆ కోరిక ఆదర్శకుటుంబంతో తీరింది. కానీ, ఇక్కడే గురూజీ ఊహించని ఫ్లాప్ ఇచ్చాడు.

ఆదర్శకుటుంబం అని టైటిల్ పెట్టి వెంకీ లుక్ రిలీజ్ చేయగానే అందరూ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఎంతో ఊహించుకున్నారు. రాను రాను సినిమాలో వెంకీ ఫ్యామిలీగా నటించిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి..కూతురు, కొడుకు పాత్రల్లో నటించిన వారి ఇంట్రో వీడియోస్ చూసి ఆ అంచనాలు ఇంకాస్త పెరిగాయి. రిలీజ్‌కి ముందు ఈ సినిమాను బ్లాస్ట్ మూవీతో పోల్చి మాట్లాడితే..మళ్ళీ కొన్ని సీన్ రీషూట్స్ చేశారు.

ఇంత చేసినా ఆదర్శకుటుంబం ఆకట్టుకోలేకపోయింది. అసలు, వెంకటేష్ లాంటి హీరో డేట్స్ ఇవ్వడం చాలా కష్టం. అలాంటిది, ఎన్నో ఏళ్ళుగా అభిమానులు ఎదురుచూస్తున్న కాంబినేషన్‌లో వచ్చిన సినిమా మరీ ఇంత పేలవమైన కథతో వండి వడ్డిస్తారా..అంటూ గురూజీపైన వెంకీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏరకంగా కూడా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలతో పోల్చుకోలేని మూవీగా ఆదర్శకుటుంబం ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ ఫ్లాప్‌కి పూర్తిగా బాధ్యత త్రివిక్రమ్ శ్రీనివాస్‌దే అంటూ ఫిల్మ్ సర్కిల్స్‌లో మాట్లాడుకుంటున్నారు.

ఎన్‌టిర్ సినిమాపై ఏకే 47 ఎఫెక్ట్?

ఏకే 47 ఎఫెక్ట్ ఇప్పుడు ఎన్‌టిర్ చేయాల్సిన గాడ్ ఆఫ్ వార్ సినిమా మీద పడనుందా? అంటే అవుననే మాట బలంగా వినిపిస్తోంది. గతంలో త్రివిక్రమ్ అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని తారక్‌తో తీసి భారీ హిట్ ఇచ్చాడు. ఈసారి వచ్చే సినిమా పాన్ ఇండియా లెవల్‌లో అంతకుమించి ఉండాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. కానీ, తాజాగా వచ్చిన ఆదర్శకుటుంబం సినిమా ఫలితం తర్వాత ఇప్పుడు కొత్త సందేహాలు కలుగుతున్నాయి. మరి, ఈ ప్రాజెక్ట్ ఉంటుందా..లేదా అనేది తెలియాల్సి ఉంది.

#Trivikram#Venkatesh#AK-47#Srinidhi Setty
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి