ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. అది పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ప్రభుత్వం ఎలాంటి క్రాప్ హాలిడేను ప్రకటించలేదన్నారు. ప్రస్తుతం ఎల్ నినో తీవ్రంగా ఉందని దానిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తున్నామని, ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సబ్సిడీలో అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ఆరు నెలలుగా ఎలాంటి పంటలు వేయాలో రైతులకు చెబుతున్నామని, వారు నష్టపోకుండా చూస్తామన్నారు. ఎల నినో తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెరువులు, ప్రాజెక్టుల్లో నీళ్లు లేవన్నారు. రైతులను కాపాడుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు.
తెలంగాణ
ప్రభుత్వం క్రాప్ హాలిడేపై మంత్రి తుమ్మల క్లారిటీ
రచన: Mahesh••2 నిమిషాల పఠనం
ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. అది పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.
#Thummala Nageswara Rao#Crop Holiday#Telangana Government#swechaa news


