Nayanathara: సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది నయనతార. తమిళంలో, తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందికుంటోంది. అంతేకాదు, బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన నయన్..అక్కడ కూడా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అయితే, నయన్ విషయంలో మేకర్స్ నుంచి ఎప్పుడూ ఓ కంప్లైంట్ వస్తోంది. అదే, సినిమా ప్రమోషన్స్‌కి రాదు అని. తాజాగా నటించిన సినిమాకి ఇలాగే చేయడం ఆ నిర్మాతలని బాగా డిసప్పాయింట్ చేసింది.
ఆర్జే బాలాజీ దర్శకత్వంలో నయనతార అమ్మవారి పాత్రలో నటించిన మూకుత్తి అమ్మన్ మంచి విజయాన్ని అందుకుంది. అప్పటి వరకూ ఫక్తు కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన నయన్..హీరోలతో రొమాన్స్, గ్లామర్ రోల్స్, బికినీ షూట్స్‌తో హీటెక్కైంచింది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతోనూ నయన్ మంచి సక్సెస్‌లు చూసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.
ఇలా, సౌత్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని, మార్కెట్‌ను ఏర్పరచుకున్న నయనతార, మైథలాజికల్ మూవీస్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. శ్రీరామరాజ్యం, మూకుత్తి అమ్మన్ లాంటి సినిమాలలో నయన్ నటనకి అందరూ ఎంతో ఆకర్షితులయ్యారు. ఆరకంగా, ఆమెకి మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే, నయన్ ఎప్పుడు తను నటించిన సినిమాల ప్రమోషన్స్‌కి హాజరవకపోవడం నిర్మాతలకి కాస్త ఇబ్బందిగా మారుతోంది.
సినిమా మేకింగ్ అంతా ఒకెత్తైతే, రిలీజ్ ముందు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు చేసేప్రమోషనల్ స్ట్రాటజీస్ ఒకెత్తు. అంతేకాదు, స్పెషల్ ఇంటర్వ్యూస్, ప్రమోషనల్ ఈవెంట్స్, ప్రీరిలీజ్ ఫంక్షన్స్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తాయి. వీటికి, ప్రధాన తారాగణం సపోర్ట్ చాలా అవసరం. కానీ, నయన్ మాత్రం సినిమా షూటింగ్ పూర్తి చేసిందంటే..ఇక, ఆ సినిమా గురించి పట్టించుకోదు. తాజాగా, వచ్చిన మూకుత్తి అమ్మన్ 2 విషయంలో కూడా ఇదే రిపీటవడంతో దర్శకుడు సుందర్.సి బాగా ఫీలైనట్టుగా కోలీవుడ్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. మరి, ఇకనుంచైనా నయన్ సినిమా ప్రమోషన్స్‌కి తన సపోర్ట్ ఇస్తుందా..ఈ పద్ధతి మార్చుకుంటుందా లేదా చూడాలి.


