టాప్ న్యూస్

TG : రేవంత్ సర్కారును వణికిస్తున్న ‘కర్ణాటక’ రిజల్ట్స్..!

రచన: Kumar••6 నిమిషాల పఠనం

త్వరలో రాష్ట్రంలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది.ఈ ఎన్నికల్లో కర్ణాటక జరిగిన విధంగానే ఓటమి ఎదురు అవుతుందని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతున్నట్టు సమాచారం. కర్ణాటకలో ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘బీజేపీ-జేడీఎస్’ కూటమి మొత్తం నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది.

త్వరలో రాష్ట్రంలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది.ఈ ఎన్నికల్లో కర్ణాటక జరిగిన విధంగానే ఓటమి ఎదురు అవుతుందని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతున్నట్టు సమాచారం. కర్ణాటకలో ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘బీజేపీ-జేడీఎస్’ కూటమి మొత్తం నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో మూడు బీజేపీ గెలుచుకోగా.. జేడీఎస్ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం మొత్తం 4 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి కూడా గెలుచుకోలేదు. దీనికి కర్ణాటక ప్రభుత్వంపై గల ప్రజావ్యతిరేకతే కారణమని చర్చ జరుగుతోంది.

తెలంగాణలోనూ రిపీట్ అయ్యేనా?

కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే తెలంగాణలోనూ రిపీట్ అవుతాయనే ప్రచారం జోరందుకుంది. ఎందుకంటే ఇక్కడి ప్రభుత్వం కూడా అటు ఉపాధ్యాయులు, స్టూడెంట్ల విషయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, పేస్కేల్, డీఏల విషయంలో రేవంత్ సర్కార్ ఏమి పట్టనట్టు వ్యవహరిస్తోందని ఉపాధ్యాయ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు.ఇక గ్యాడ్యుయేట్స్ సైతం తమకు ఏమీ చేయలేదని, నిరుద్యోగ భృతి లేదు కదా? నోటిఫికేషన్లు సైతం పూర్తిగా భర్తీ చేయడం లేదని విమర్శలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో గ్రాడ్యుయేట్ ఓటర్లు మద్దతు ఇస్తారా? లేదా? అనే విషయంపై చర్చ జరుగుతోంది. కర్ణాటక ఫలితాలు రేవంత్ సర్కారుకు నిద్రలేకుండా చేస్తున్నట్టు సమాచారం. కర్ణాటకలో నాలుగు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో తెలంగాణ నేతల్లో ఆందోళన నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాకే రాష్ట్రంలోనూ హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అక్కడ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దానికి నిరుద్యోగం, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, ద్రవ్యోల్బణం వంటి అంశాలే కారణంగా తెలుస్తోంది.

రెండు స్థానాలు.. 10 మంది మంత్రులకు టెన్షన్..

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉంటుందని మంత్రులు, ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఈ రెండు స్థానాల్లో పార్టీ విజయం సాధించడం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని 10 మంది మంత్రులకు కీలకంగా మారింది. ఈ ఎన్నికల్లో గెలిస్తేనే వారికి భవిష్యత్ ఉంటుంది. లేదంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమి ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదిలాఉండగా, గ్రాడ్యుయేట్ ఎన్నికలతో తమకు ఏం సంబంధం లేదు అన్నట్టుగా స్థానిక ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.ఖమ్మం, వరంగల్, నల్గొండ అభ్యర్థి ఎంపిక విషయంలో సొంత పార్టీలో అభిప్రాయభేదాలు తలెత్తగా.. సర్వోత్తమ్ రెడ్డికి సహకరించకుండా తన అనుచరుడికి మంత్రి పొంగులేటి మద్దతు ఇస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియను సైతం లైట్ తీసుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఏడాది ప్రారంభంలో కాంగ్రెస్ నేతలంతా గ్రామాల్లోకి వెళ్లాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామని సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పటికే నిఘా వర్గాలు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. అందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల నిర్లక్ష్యంతో పాటు నిరుద్యోగులు, ఉద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కూడా ఓ కారణమని చెప్పినట్టు తెలిసింది.

#karnataka mlc election results#telangana#congress leaders#defeat fear#revanth reddy#politic#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి