తెలంగాణ

Hyderabad : అండాల దందా.. నగరంలో మరో 18 మంది యువతులు అరెస్టు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

యువతులకు డబ్బులు ఎరగా వేసి అక్రమంగా అండాలు సేకరించి డబ్బులు సంపాదిస్తున్న మరో ముఠాగుట్టు రట్టయ్యింది. నిన్న బేగంపేట ఘటన మరువకముందే తాజాగా సరూర్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలోని ఓ ఇంట్లో యువతుల నుంచి అండాలు సేకరిస్తున్న అక్రమార్కులను పోలీసులు గుర్తించారు.

యువతులకు డబ్బులు ఎరగా వేసి అక్రమంగా అండాలు సేకరించి డబ్బులు సంపాదిస్తున్న మరో ముఠాగుట్టు రట్టయ్యింది. నిన్న బేగంపేట ఘటన మరువకముందే తాజాగా సరూర్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలోని ఓ ఇంట్లో యువతుల నుంచి అండాలు సేకరిస్తున్న అక్రమార్కులను పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కాలేజీ స్టూడెంట్స్‌ను లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్న అండాల విక్రయ ముఠాలను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముందస్తు సమాచారంతో సరూర్ నగర్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో ఉన్న 18 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాలేజీ విద్యార్థినులు, నిరుపేద యువతులను లక్ష్యంగా చేసుకుని ఈ దందా నడుపుతున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వారికి పెద్ద మొత్తంలో డబ్బుల ఆశ చూపి, ఇంజెక్షన్లు ఇచ్చి అండాలను సేకరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

యువతుల నుంచి సేకరించిన అండాలను హైదరాబాద్‌లోని కొన్ని ప్రముఖ ఐవీఎఫ్ (IVF) కేంద్రాలకు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నట్లు పొలీసులు నిర్దారణకు వచ్చారు. దాడుల్లో పట్టుబడిన 18 మంది యువతులను అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. అండాలు సేకరించే నిర్వాహకుల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు? ఈ ముఠాతో నగరంలోని ఐవీఎఫ్ సెంటర్లు చేతులు కలిపాయా? అన్న కోణంలోనూ సమగ్ర విచారణ జరుపుతున్నారు.

ఇదిలాఉండగా, దేశవ్యాప్తంగా అక్రమ అండాల సేకరణ, సరోగసీ ముఠాల అక్రమాలు వరుసగా వెలుగుచూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న బేగంపేట, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లోని యువతుల హాస్టళ్లపై పోలీసులు దాడులు చేయగా.. గర్ల్స్ హాస్టల్స్ పేరిట బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా నుంచి యువతులను నగరానికి తీసుకువచ్చి చట్టవిరుద్ధంగా అండాలను సేకరిస్తున్న ముఠాను పట్టుకున్నారు. కాగా, నగరంలో మరికొన్ని ముఠాలు ఈ దందాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వారి ఆటను కూడా కట్టించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

#Women's eggs#collecting#hyderabad#crime#illegal activity#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి