National

ఇందిరా గాంధీ వర్ధంతి.. జ్ఞాపకాలను నెమరువేసుకున్న రాహుల్, ప్రియాంక గాంధీ!

రచన: Mamatha puppala•••4 నిమిషాల పఠనం

భారతదేశ తొలి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఆమెతో గడిపిన మధుర బాల్య జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా గుర్తుచేసుకున్నారు. తమ నాయనమ్మతో కలిసి ఉన్న అరుదైన చిన్ననాటి ఫొటోలను షేర్ చేస్తూ భావోద్వేగ పోస్టులు పెట్టారు.

 భారతదేశ తొలి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఆమెతో గడిపిన మధుర బాల్య జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా గుర్తుచేసుకున్నారు. తమ నాయనమ్మతో కలిసి ఉన్న అరుదైన చిన్ననాటి ఫొటోలను షేర్ చేస్తూ భావోద్వేగ పోస్టులు పెట్టారు.

 రాహుల్ గాంధీ తన 'దాదీ' (నాయనమ్మ) ఇందిరా గాంధీ ఒడిలో కూర్చుని, ఆమె చేతులు పట్టుకుని యజుర్వేదంలోని శాంతి మంత్రం విన్న క్షణాలను గుర్తుచేసుకున్నారు. ‘నీ ఒడిలో కూర్చోవడం, నీ రెండు చేతులను పట్టుకోవడం, నువ్వు చెప్పే మాటలను వింటూ నీ వెంటే వాటిని పునరావృతం చేయడం ఒక అద్భుతం’ అంటూ 'అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ' అనే సంస్కృత శ్లోకాన్ని పంచుకున్నారు. ‘నువ్వు నాకు ఇచ్చిన అందమైన బహుమతి ఇది’ అని ఆయన కొనియాడారు.

 మరోవైపు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా తన నాయనమ్మతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ఇందిరా గాంధీ అసాధారణమైన ధైర్యసాహసాలు, వ్యక్తిత్వం కలిగిన గొప్ప మహిళ అని కొనియాడారు. ‘ఆమె ఎంత అందమైన మహిళ! ఆకాశంలా స్వేచ్ఛగా, సముద్రంలా లోతుగా, భూమిలా సహనంతో, అగ్ని కంటే తేజస్సుతో ప్రకాశించేవారు’ అంటూ ఆమెను ప్రశంసించారు.

 ఇక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఆమె మరణానికి సరిగ్గా ఒక్క రోజు ముందు చేసిన చివరి ప్రసంగంలోని మాటలను ఖర్గే ఉటంకించారు. దేశ ఐక్యత, సమగ్రత, దేశ గౌరవాన్ని కాపాడడంలో ఆమె అంకితభావం ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. 1917 నవంబర్ 19న జన్మించిన ఇందిరా గాంధీ.. 1971 బంగ్లాదేశ్ ఏర్పాటు, హరిత విప్లవం ద్వారా దేశాన్ని ఆహార స్వయంసమృద్ధి వైపు నడిపించడం, పోఖ్రాన్ అణు పరీక్షలు వంటి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలతో దేశ ప్రగతికి బాటలు వేశారు.

 

#IndiraGandhiDeathAnniversary#RahulGandhiPriyankaGandhi#MallikarjunKhargeTribute#IronLadyOfIndia#NationalNewsTelugu#CongressLeadersNews#IndianHistoryTelugu#PoliticalNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి