Pooja Hegde: టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో పూజా హెగ్డే కెరీర్ చాలా ఇబ్బందుల్లో ఉందా.! అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకప్పుడు తెలుగులో ఈమె క్రేజీ బ్యూటీ. వరుసగా భారీ చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది. కానీ, ఇప్పుడు పోటీ ఎక్కువవడంతో పాటు వరుస ఫ్లాప్స్ కూడా రావడంతో తెలుగుతో పాటు మిగతా భాషలలోనూ అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం, చేతిలో 3 సినిమాలే పూజా కెరీర్‌ను కాపాడేది.
తెలుగులో దుల్కర్ సరసన చేస్తున్న శ్రీశ్రీ..
చాలా లాంగ్ గ్యాప్ తర్వాత పూజా హెగ్డే తెలుగులో చేస్తోన్న సినిమా శ్రీశ్రీ. ఇందులో, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు. రవి నెలకుడితి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెలుగుతో పాటు మలయాళంలోనూ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఈ డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే, దుల్కర్ ఇటు తెలుగు అటు మలయాళ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడు. కాబట్టి, శ్రీశ్రీ హిట్ అయితే మళ్ళీ పూజా ఈ రెండు భాషల్లో పుంజుకోవచ్చు.
కాంచన 4తో భయపెడుతుందా?
డాన్స్ కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ కం హీరో రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న కాంచన సిరీస్‌లో భాగంగా వస్తోంది కాంచన 4. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ముని, కాంచన, కాంచన, 2..ఇలా ఈ ఫ్రాంఛైజీస్‌లో వరుసగా వస్తోన్న సినిమాలన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా మీద కూడా బాగా అంచనాలున్నాయి. ఇందులో, పూజా భయపెట్టే పాత్రలో నటిస్తున్నట్టుగా సమాచారం.
ఈ రెండు సినిమాలు కాకుండా హిందీలో ఓ రెండు సినిమాలను చేస్తోంది పూజా హెగ్డే. గతంలో కేవలం తెలుగులో మాత్రమే హిట్స్ కొడుతూ స్టార్ హీరోయిన్‌గా మారిన పూజా, ఆ తర్వాత తమిళంలో నటించింది. అలాగే, హిందీలోనూ హీరోయిన్‌గా అవకాశాలను అందుకుంది. కానీ, తెలుగులో వచ్చినన్ని సక్సెస్‌లు మిగతా రెండు భాషల్లో రాలేదు. మరి, ఇప్పుడు చేస్తోన్న తెలుగు-తమిళం-హిందీ భాషలలో ఎక్కడ హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో చూడాలి. ఏదేమైనా, పూజాకి చేతిలో ఉన్న ఈ మూడు ప్రాజెక్ట్స్ చాలా కీలకంగా మారాయి.


