National

National : సీఎం ఒమర్ అబ్దుల్లా కుర్చీకి గండం..ఉండేనా? ఊడేనా?

రచన: Kumar••5 నిమిషాల పఠనం

జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది.సీఎం ఒమర్ అబ్దుల్లాకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యి తీర్మానం సైతం చేసుకున్నట్టు సమాచారం. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన ఉన్నట్టు తెలుస్తోంది.

జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది.సీఎం ఒమర్ అబ్దుల్లాకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యి తీర్మానం సైతం చేసుకున్నట్టు సమాచారం. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తమ మీద కొందరు సీనియర్ల పెత్తనం ఎక్కువ అయ్యిందని.. సమస్యలు విన్నవించేందుకు వెళితే అధిష్టానం పట్టించుకోవడం లేదని నేషనల్ కాన్ఫరెన్స్ (NC)లోని కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది.

తిరుగుబాటు జెండా ఎగరేస్తారా?

ఒమర్ అబ్దుల్లా సర్కారుపై సొంత ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేసే క్రమంలో ఉన్నట్టు తెలియడంతో ముఖ్యమంత్రి ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్న 24 మంది ఎమ్మెల్యేలు.. సీఎం ఒమర్ అబ్దుల్లాతో పాటు పార్టీ అధిష్ఠానానికి అల్టిమేటం పంపినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం శ్రీనగర్‌లోని NC ఎమ్మెల్యే ఖైజర్ జంషీద్‌లోన్ నివాసంలో 19 మంది ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. అనంతరం సీఎంకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

రెబల్ ఎమ్మెల్యేల ప్రధాన డిమాండ్లు..

సీఎం ఒమర్ అబ్దుల్లా సలహాదారు నాసిర్ అస్లామ్ వానీ తొలగింపు, డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి సైతం మంత్రివర్గం నుంచి తప్పించడం, రెండేళ్లుగా మంత్రి పదవుల్లో కొనసాగుతున్న వారిని తొలగించి, మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం, ఎన్నికల మేనిఫెస్టో అమలు కోసం రోడ్‌మ్యాప్ సిద్ధం చేయడం, ఎమ్మెల్యేలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడడంపై తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండగా, సమావేశానికి హాజరైన రెబల్ ఎమ్మెల్యేలు స్పందించారు.'మేము తిరుగుబాటుదారులం కాదు. పార్టీని బలోపేతం చేయడానికే పోరాడుతున్నాం. పార్టీ, ప్రభుత్వం కేవలం కొందరు వ్యక్తుల సొంత ఆస్తిలా మారకూడదు.పారదర్శకత, జవాబుదారీతనం కోసమే మేం డిమాండ్ చేస్తున్నాం' అని పేర్కొన్నారు.ఈ సమావేశంలో కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు, పార్టీ అధిష్ఠానం తమతో వ్యవహరించిన తీరును గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనైనట్టు తెలుస్తోంది.

ఒమర్ సర్కార్ ఉండేనా? ఊడేనా?

జమ్మూ కాశ్మీర్ శాసనసభలో 90 మంది సభ్యులు ఉండగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌‌కు ఆరుగురు, ఇతరులు, స్వతంత్రుల మద్దతుతో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సొంత పార్టీలోని 24 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉండటం, సీఎం ఒమర్ అబ్దుల్లా నాయకత్వానికి పెను సవాలుగా మారింది. శ్రీనగర్ ఎంపీ అగా రుహుల్లా కూడా పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడం సంచలనానికి తెరలేపింది. కాగా, కాశ్మీర్ ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణ ద్వారా పాత వాళ్లకు మంగళం పలికి, కొత్త చాన్స్ ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలా చేస్తే ఎటాంటి ఒమర్ అబ్దుల్లా సర్కారుకు ఎటువంటి ఢోకా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

#cm omar abdullah#rebal mla's#National conferance#politics#jammukashmeer#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి