తెలంగాణ

TG : మురుగు నీరే పంటలకు సాగు నీరైంది..!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆగం అవుతున్నారు. చేతికొచ్చిన పంట నీరు లేక ఎండిపోతుండటంతో ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. దీంతో మురుగు నీటిని మోటార్లు పెట్టి మరీ పొలాలకు మళ్లిస్తున్నారు. అన్నదాతల పరిస్థితి ప్రస్తుతం మరింత దయనీయంగా తయారైంది. ఓ వైపు వర్షాలు లేక ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అల్లాడుతున్నారు.

రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆగం అవుతున్నారు. చేతికొచ్చిన పంట నీరు లేక ఎండిపోతుండటంతో ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. దీంతో మురుగు నీటిని మోటార్లు పెట్టి మరీ పొలాలకు మళ్లిస్తున్నారు. అన్నదాతల పరిస్థితి ప్రస్తుతం మరింత దయనీయంగా తయారైంది. ఓ వైపు వర్షాలు లేక ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అల్లాడుతున్నారు. పంట కోతకు రాకముందే ఎండిపోతుండటంతో పెట్టుబడి కూడా రావడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.

రాష్ట్రంలో నదులు పారుతున్నా పంటలకు నీళ్లివ్వలేని దుస్థితి నెలకొందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగు నీటి కష్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే జిల్లా నుంచి కృష్ణా, తుంగభద్ర నదులున్నా పారుతున్నా పంటలకు నీరు అందడం లేదని, తమను ప్రభుత్వం ఆదుకోవడం లేదని మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా రైతులకు సైతం నీళ్లివ్వకుండా గోస పెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కాలువల్లో, చెరువులు, కుంటల్లో నీరు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. అయితే, బావులు, చెరువుల్లో నీరు ఉన్న చోట మోటర్ల ద్వారా పొలాలకు నీరు అందించేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తుంటే.. విద్యుత్ కోతల కారణంగా నీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే అయిజ మండలం తుపత్రాల రైతుల మిరప పంటకు నీటి కష్టాలు ఎదురయ్యాయి.

దీంతో పెద్ద వాగులోని మురుగునీటితో పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం 20 ట్యాంకర్లతో మురుగునీటిని పొలాలకు తరలిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.అర్నబ్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నా రైతుల కష్టాలు తీరడం లేదని సమాచారం. ప్రభుత్వం వెంటనే స్పందించి సాగు నీరు అందించాలని, పంటలు ఎండిపోయిన చోట పెట్టుబడి సాయంతో పాటు నష్టపరిహారం చెల్లించాలని బాధిత అన్నదాతలు, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

#drinage water#crops#mahaboobnagar#telangana#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి