Tollywood: ఒకప్పుడు, హర్రర్..సస్పెన్స్ థ్రిల్లర్..క్రైమ్ కామెడీ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవి. ఒక దశాబ్దం మొత్తం ఎక్కువగా ఈ జానర్ సినిమాలే వచ్చాయి. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలు నిర్మాతలకి భారీ లాభాలను తెచ్చాయి. అయితే, ఈ మధ్య కాలంలో వచ్చిన హర్రర్ సినిమాలను జనాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీనికి కారణం..వాటిని ఆసక్తికరంగా తీయకపోవడమే అని చెప్పుకుంటున్నారు.
విఠలాచార్య సినిమాలకి బాగా క్రేజ్:
బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఎక్కువగా దెయ్యాల సినిమాలను చూసి ప్రేక్షకులు నిద్రపట్టని రాత్రుళ్ళు గడిపారు. ముఖ్యంగా, ఈ జానర్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా విఠాలాచార్య నిలిచారు. ఆయన, సినిమాలలో గుర్రాలు..దెయ్యాలు..కామెడీ..ప్రేమ కథ..ఇలా అన్నీ అంశాలు కలగలిపి ఉండేవి. జగన్మోహిని లాంటి సినిమాలను ఆయన అప్పట్లోనే ఎలాంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా అద్భుతంగా తీశారు. మాయాబజార్ లాంటి సినిమాలు ఇప్పటికీ సినీ లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
భయపెట్టిన ఆర్జీవీ:
ఇక, నెక్స్ట్ జనరేషన్ దర్శకులలో సంచలన దర్శకుడిగా పేరు పొందిన రాంగోపాల్ వర్మ శివ, రంగీలా, సత్య లాంటి పక్కా కమర్షియల్ సినిమాలను తీసి సత్తా చాటుకున్నాడు. అలాంటి, జానర్ సినిమాలను కాకుండా జనాలను భయపెట్టాలని రాత్రి, దెయ్యం. భూత్ లాంటి సినిమాలను తీశాడు. ఈ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అప్పట్లో, వర్మ..ఈ సినిమాలు చూసి భయపడకపోతే లక్ష బహుమతి అంటూ ప్రైజ్ మనీ కూడా ప్రకటించాడు. ఆ రకంగా, అప్పట్లో హర్రర్ సినిమాలు బాగా ఆకట్టుకున్నాయి.
ఆ తర్వాత వచ్చిన మంత్ర, ప్రేమ కథా చిత్రమ్, ఇటీవల వచ్చిన రాకాస సినిమాలు పరవాలేదనిపించాయి. కానీ, ఈ మధ్య కాలంలో చూసుకుంటే, ఈ తరహా జానర్ సినిమాలపైన కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది. ఇలా తగ్గడానికి కారణం తిప్పి, తిప్పి చూపించిన సినిమాలనే చూపించడం..ఆసక్తిగా అనిపించని సన్నివేశాలను చూపించడంతో హర్రర్ అంటే భయపడాల్సింది పోయి..నవ్వుకునే స్థాయికి తీసుకువచ్చారు. దీనివల్ల..ఈ మధ్య వచ్చిన 418 కూడా ఫ్లాపైంది. మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ సమర్పకుడు. వీరి స్టాండర్డ్స్ ఏమాత్రం పనిచేయలేదు.


