తెలంగాణ

TG: అలర్ట్.. నవంబర్ 3న ఇందిరమ్మ ఇండ్లకు లాటరీ

రచన: Mahesh••3 నిమిషాల పఠనం

TG: హైదరాబాద్ నగరంలో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. నగర పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్లకు నవంబరు 3న లాటరీ తీయనున్నారు. ఈ మేరకు తెలంగాణ హౌసింగ్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది.

TG: హైదరాబాద్ నగరంలో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. నగర పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్లకు నవంబరు 3న లాటరీ తీయనున్నారు. ఈ మేరకు తెలంగాణ హౌసింగ్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఎక్కడెక్కడ లాటరీ అంటే?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముషీరాబాద్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, గోషామహల్ నియోజకవర్గాల్లోని ఇందిరమ్మ టవర్లలో ఉన్న ఫ్లాట్లకు నవంబరు 3న డ్రా తీయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ తెలిపారు. ఈ ప్రాంతాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈ డ్రా ద్వారా ఫ్లాట్లు కేటాయించనున్నారు.

నవంబరు 4న రద్దయిన ఇండ్లకు డ్రా..

ఇక గతంలో 16 నియోజకవర్గాల్లో లాటరీ తీసి ఇండ్లు కేటాయించినప్పటికీ.. కొందరు అర్హులు కాదని తేలడం, మరికొందరు గడువులోగా డబ్బులు కట్టకపోవడంతో ఆ ఫ్లాట్లను అధికారులు రద్దు చేశారు. అలా మిగిలిపోయిన ఇండ్లకు నవంబరు 4న చివరి విడతగా (మాప్ అప్) డ్రా నిర్వహించనున్నారు. గతంలో అప్లై చేసుకుని మొదటి విడతలో రానివారికి ఇందులో ఇల్లు దక్కే అవకాశం ఉంది.

ఫోన్లలోనే లైవ్ చూసుకోవచ్చు

ఈ లాటరీ ప్రక్రియ మొత్తం ఎలాంటి అవకతవకలు లేకుండా ఆన్‌లైన్ విధానంలోనే జరగనుంది. ఎవరికీ ఎలాంటి సందేహాలు రాకుండా ఈ-లాటరీని యూట్యూబ్, సోషల్ మీడియా వేదికల్లో నేరుగా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. దరఖాస్తుదారులు నేరుగా తమ మొబైల్స్‌లోనే ఫలితాలను లైవ్‌లో చూసుకునే వీలు కల్పించారు.

#Telangana#Indiramma Houses#Indiramma Housing Scheme#Hyderabad#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి