తెలంగాణ

TG: హైదరాబాద్‌లో రేపటి నుంచే ‘గ్రీన్ ట్యాంకర్లు’.. వివరాలివే!

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

TG: హైదరాబాద్ నగరంలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోర్ అర్బన్ పరిధిలో నీటి వృథాను అరికట్టేందుకు రేపటి నుంచే (నవంబర్ 1) సరికొత్తగా ‘గ్రీన్ ట్యాంకర్లు’ అందుబాటులోకి రానున్నాయి. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ కీలక మార్పులను వెల్లడించారు.

TG: హైదరాబాద్ నగరంలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోర్ అర్బన్ పరిధిలో నీటి వృథాను అరికట్టేందుకు రేపటి నుంచే (నవంబర్ 1) సరికొత్తగా ‘గ్రీన్ ట్యాంకర్లు’ అందుబాటులోకి రానున్నాయి. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ కీలక మార్పులను వెల్లడించారు.

తాగునీటిని వాటికి వాడితే కుదరదు

భవన నిర్మాణ పనులు, ల్యాండ్‌స్కేపింగ్, క్లీనింగ్ వంటి తాగునీటితో సంబంధం లేని ఇతర అవసరాలకు ఇకపై స్వచ్ఛమైన తాగునీటిని వాడటానికి వీల్లేదని సీఎస్ స్పష్టం చేశారు. ఇలాంటి పనుల కోసం మురుగునీటి శుద్ధి కేంద్రాల (STPలు) ద్వారా వచ్చిన శుద్ధి చేసిన నీటినే అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు యూజ్ చేయాలని ఆదేశించారు. ఈ నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని, రోజువారీ సరఫరా లెక్కలను ప్రభుత్వానికి సమర్పించాలని వాటర్ బోర్డు ఎండీని ఆదేశించారు.

యాప్ ద్వారానే గ్రీన్ ట్యాంకర్ల బుకింగ్

ప్రస్తుతం గ్రేటర్ వాసులు తాగునీటి ట్యాంకర్లను ఎలాగైతే బుక్ చేసుకుంటున్నారో.. అదే తరహాలో శుద్ధి చేసిన నీటి కోసం కూడా ప్రత్యేక ‘గ్రీన్ ట్యాంకర్ల’ను ప్రభుత్వం నడపనుంది. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ గ్రీన్ ట్యాంకర్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. నీటి సంరక్షణలో భాగంగా వ్యక్తిగతంగా, పరిశ్రమల స్థాయిలో నీటి వినియోగాన్ని కనీసం 20 శాతం తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

నవంబర్ 15 నాటికి అదనంగా 40 ఎంజీడీ నీరు..

హైదరాబాద్ పరిధిలో తాగునీటి అవసరాల కోసం చేపడుతున్న ప్రత్యామ్నాయ చర్యలను వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి వివరించారు. మిషన్ భగీరథ ద్వారా నగరానికి అదనంగా మరో 40 MGD నీటిని సరఫరా చేసే ప్రాజెక్టును నవంబర్ 15 నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. అంతేకాకుండా జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనమైన పట్టణ ప్రాంతాలకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు మిషన్ భగీరథ బల్క్ వాటర్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ కీలక సమీక్షా సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, మున్సిపల్ శాఖ కార్యదర్శి సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో నగరంలో నీటి కొరత తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తోంది.

#Telangana#Hyderabad News#Green Water Tankers#Hyderabad Water Supply#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి