ఏపీ

ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

రచన: NK••2 నిమిషాల పఠనం

అర్నబ్ తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకోకముందే.. ఏపీకి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి.

AP Rains: అర్నబ్ తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకోకముందే.. ఏపీకి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. రెండు రోజులు వానలు కుమ్మేయనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం రానున్న 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన పోర్టులకు 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

తుపాను 2వ తేదీన తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మచిలీపట్నంకి ఆగ్నేయంగా 1200 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం ఉంది. ఏపీకి రెండు రోజులపాటు వర్ష సూచన చేసింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మోస్తారు వానలు ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఆదివారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఐఎండీ హెచ్చరించింది.

#AP Rains#Andhra Pradesh#Cyclone#Low Pressure#Costal Andhra Pradesh#IMD#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి