KTR: ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. ఇందులో భాగంగా నవంబర్ 1న ఢిల్లీలో భారీ నిరసన కార్యక్రమం తలపెట్టింది కాంగ్రెస్. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ సెటైర్లు వేశారు. ఓటుకు నోటు చోర్‌ను పక్కన పెట్టుకుని ధర్నా చేయడమా? ఇది చాలా హ్యాస్యాస్పదంగా ఉంది అంటూ.. కాంగ్రెస్ నిరసన కార్యక్రమంపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
''ఓటు చోరీకి వ్యతిరేకంగా నవంబర్ 1న ఢిల్లీలో నిరసన తెలుపుతున్నారట. ఓటుకు నోటు చోర్‌ను పక్కన పెట్టుకుని.. నిరసన తెలపడం హాస్యస్పాదంగా ఉంది. తెలంగాణలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించిన రాహుల్ గాంధీ, ఇప్పుడు దేశంలో ఓటు చోరీకి వ్యతిరేకంగా తన 'ఓటుకు నోటు' చాంపియన్ స్కామ్‌స్టర్ రేవంత్ రెడ్డితో కలిసి ధర్నాకు కూర్చుంటున్నారు. ఇంతకంటే విడ్డూరం ఏముంటుంది'' అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. భారత ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.. జై హింద్, జై తెలంగాణ అని స్లోగన్ ఇచ్చారు కేటీఆర్.
సీఎం రేవంత్ ను ఉద్దేశించి ఓటుకు నోటు చోర్ అంటూ కాంగ్రెస్ నిరసన కార్యక్రమంపై కేటీఆర్ చేసిన ట్వీట్ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాగా, అవకాశం వచ్చినప్పుడల్లా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసును కేటీఆర్ హైలైట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, కాంగ్రెస్ ను ఇరుకున పట్టే ప్రయత్నం చేస్తున్నారు.


