వ్యాపారం

Trivikram: గురూజీని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..కారణం ఆ దర్శకుడే!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Trivikram: సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ ఎవరంటే.. అనిల్ రావిపూడి గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన సినిమా ఎప్పుడు మొదలు పెడుతున్నాడో, ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఒకప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ గురించి మాట్లాడుకున్నారు. వారంలో కథ, ఇంకో వారంలో డైలాగ్స్..మూడు నెలల్లో సినిమా రిలీజ్ అంటే అది ఒక్క పూరికి మాత్రమే సాధ్యమయ్యేది.

కానీ, ఆయన ఫ్లాప్స్ వల్ల స్లో కావడంతో.. ఇప్పుడు ఆయన స్థానంలో అనిల్ రావిపూడి రఫ్ఫాడిస్తున్నాడు. వరుసగా 9 బ్లాక్ బస్టర్స్, పెద్ద స్టార్స్ కి సాలీడ్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే, ఆయన గురించి ఒకటి ప్రత్యేకంగా చెప్పాలి. జంధ్యాల, ఈవీవీలను కలిపి అనిల్ రావిపూడి అనే కాంప్లిమెంట్ ఎప్పుడో అందుకున్నాడు. అంతేకాదు, ప్రమోషన్స్ విషయంలో అనిల్ రావిపూడి హాట్ టాపిక్ అయ్యాడు.

ముఖ్యంగా, మన శంకరవరప్రసాద్‌గారు నుంచి కొత్త తరహా ప్రమోషన్స్ లో అనిల్ దిట్ట అనిపించుకున్నాడు. ఇప్పుడు, వెంకటేష్-కళ్యాణ్ రామ్ లతో చేస్తున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. అప్పుడే, మ్యూజిక్ డైరెక్టర్ ని పరిచయం చేస్తూ వదిలిన వీడియో బాగా ట్రెండ్ అయింది. అయితే, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అనిల్ రావిపూడి ని ఫాలో అవుతున్నాడని బాగా ట్రోల్ చేస్తున్నారు.

దీనికి, కారణం ఆయన రూపొందిస్తున్న 'ఆదర్శకుటుంబం'. ఈ సినిమాలో వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టులో సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టిన త్రివిక్రమ్..వెంకీ, శ్రీనిధిలతో పాటు వారి పిల్లలుగా నటిస్తున్న పాత్రల వీడియోలను వదిలాడు. ఈ స్టైల్ మొత్తం అనిల్ రావిపూడి ని కాపీ కొట్టినట్టుందంటున్నారు. ఆల్రెడీ కథ, సీన్స్ త్రివిక్రమ్ కాపీ కొడతాడని అపవాదు ఉంది. ఇప్పుడు, ఇది మొదలైంది. ఏదేమైనా 'ఆదర్శకుటుంబం' సినిమాకి మాత్రం మంచి ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

#trivikram#anilravipudi#aadarsakutumbam#venkatesh#srinidhisetty
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి