సినిమా

Puri Jagannadh: స్లమ్ డాగ్ సక్సెస్ కోసం పూరి లాంగ్ గ్యాప్..!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Puri Jagannadh: పూరి జగన్నాధ్..ఈ పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది..బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి, పోకిరి, బిజినెస్ మేన్, దేశముదురు, ఏక్ నిరంజన్, బుజ్జిగాడు లాంటి భారీ కమర్షియల్ హిట్ సినిమాలు. ఇవన్నీ, పూరి జగన్నాధ్ వారం రోజుల్లో రాసిన కథలే. టాలీవుడ్ లో ఏ హీరోకైనా మాస్ ఇమేజ్ రావాలంటే ఒక్కసారి పూరితో సినిమా చేస్తే చాలు వచ్చేస్తుంది.

పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు..ఇలా విపరీతమైన మాస్ హీరోలుగా బాక్సాఫీస్ వద్ద డబుల్ ఎనర్జీతో వసూళ్ళు సాధించడానికి పూరి కారణం. ఒకప్పుడు హీరో పేరును కూడా డామినేట్ చేసిన దర్శకుడు. అలాంటి, దర్శకుడు ఫ్లాపుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాడు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ మూవీతో సాలీడ్ హిట్ కొట్టాడు.

మళ్ళీ, కథ మొదటికే వచ్చింది. ఆ తర్వాత చేసిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో ట్రాక్ తప్పాడు. స్లమ్ డాగ్ మూవీతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. అయితే, పూరి కెరీర్ లో ఇంత లాంగ్ వచ్చింది ఎప్పుడూ లేదు. తెలుగులో హీరోలు డేట్స్ ఇవ్వకపోవడంతో తమిళంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తో చేతులు కలిపాడు.

వీరి కాంబినేషన్‌లో స్లమ్ డాగ్ మూవీ రూపొందుతోంది. సంయుక్త మేనన్ హీరోయిన్‌గా..టబు కీలక పాత్రలో కనిపించబోతోంది. అయితే, లైగర్..డబుల్ ఇస్మార్ట్ ఫ్లాప్స్ వల్ల డిట్రిబ్యూటర్స్ కి పూరి బాకీ ఉన్నాడని, అవి చెల్లిస్తేనే స్లమ్ డాగ్ సినిమా విడుదలకి సపోర్ట్ చేస్తామని మాట్లాడినట్టుగా ఇన్‌సైడ్ టాక్. కానీ, గ్యారెంటీ హిట్ కోసమే పూరి స్లమ్ డాగ్ కోసం శ్రమిస్తున్నాడని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా పూరి స్లమ్ డాగ్ తో హిట్ కొట్టి అందరికీ సమాధానం చెప్పాలనుకుంటున్నాడు. చూడాలి, మరి..ఈ మూవీతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో.

#PuriJagannadh#SamyukthaMenon#Tabu#VijaySethupathi#SlumDog
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి