Akhil Akkineni: అక్కినేని హీరోలలో చాలా స్లోగా సక్సెస్ అందుకున్న హీరో అఖిల్ అని ఇండస్ట్రీలో బాగా వినిపించింది. మనం సినిమాలో క్లైమాక్స్ చూసిన ప్రతీ ఒక్కరు మెస్మరైజ్ అయ్యారు. సినిమా మొత్తం ఒక ఎత్తైతే, క్లైమాక్స్ లో అఖిల్ ఎంట్రీ ఒక్కటే సాలీడ్‌గా పడింది. ఓ హాలీవుడ్ హీరోలా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు. అయితే, అది హీరోగా నిలబడటానికి ఉపయోగపడలేదు.
అఖిల్ మొదటి సినిమా స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా డిజాస్టర్స్ గా నిలిచింది. ఆ తర్వాత చేసిన సినిమాలు సో సోగా ఆడాయి తప్ప, భారీ కమర్షియల్ హిట్ గా నిలవలేదు. అఖిల్ కి స్టార్ హీరో అనే ఇమేజ్ ని తెచ్చిపెట్టలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా వచ్చింది..హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ, అది అఖిల్ ని ఒక స్థాయిలో మాత్రం నిలబెట్టలేదు.
అయితే, ఇప్పుడు వచ్చిన లెనిన్ సినిమాతో మాత్రం మంచి పర్ఫార్మర్ గా పేరు సంపాదించుకున్నాడు. లెనిన్ సినిమాలో చేసిన ఛాలెంజింగ్ రోల్ అఖిల్ కి మంచి పేరును తెచ్చిపెట్టింది. అంతేకాదు, అఖిల్ కెరీర్ లో మొదటి 100 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా లెనిన్ సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పుడు బ్రేకీవెన్ అవుతుందనుకున్నారు. కానీ, ఇలా 100 కోట్ల మార్క్ చేరుతుందని మాత్రం భావించలేదు.
దీంతో, అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున కూడా ఈ సినిమా సక్సెస్ పట్ల చాలా గర్వంగా ఉన్నాడు. ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరికి చెందుతుంది. వాస్తవానికి, ఈ సినిమా నాని చెయ్యాల్సి ఉండగా..పలు కారణాల వల్ల అఖిల్ చేతికి వచ్చి తన ఖాతాలో 100 కోట్ల సినిమాగా నిలిచింది. ఇకపై, ఈ అక్కినేని హీరో చేయబోతున్న సినిమాలపై అంచనాలు బాగానే ఉండబోతున్నాయి.












