వైరల్ న్యూస్

Jawan Saves Life: నువ్వు దేవుడు సామీ.. ప్రాణాలకు తెగించి భక్తుడిని కాపాడిన జవాన్

రచన: NK3 నిమిషాల పఠనం

Jawan Saves Life: నదిలో కొట్టుకుపోతున్న భక్తుడిని ఓ జవాన్ తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ రక్షించాడు. ప్రమాదం అని తెలిసినా ఆ జవాన్ వెనకడుగు వేయలేదు. నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నా భయపడలేదు. ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకండా ధైర్య సాహసాలతో నదిలోకి దూకి నీళ్లలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ లో ఈ ఘటన జరిగింది.

యూపీ నోయిడాకు చెందిన శివ భక్తుడు హరిద్వార్‌లోని కాంగ్రా ఘాట్ వద్ద గంగా నదిలో స్నానం చేస్తున్నాడు. ఆ సమయంలో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. వరద ఉధృతికి అతడు నదిలో కొట్టుకుపోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఉత్తరాఖండ్ SDRF జవాన్ ఆ వ్యక్తిని కాపాడేందుకు నదిలోకి దూకాడు. ఈదుతూ వెళ్లి నదిలో కొట్టుకుపోతున్న భక్తుడిని పట్టుకున్నాడు. వరద ఉధృతిని తట్టుకుని అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు.

అదే సమయంలో ఘాట్ గట్టుపైన ఉన్న మరో జవాన్ తాడుతో కూడిన లైఫ్ జాకెట్ ను నదిలోకి విసిరాడు. అయితే, వరద ప్రవాహ వేగానికి అది దూరంగా పడిపోయింది. అయినప్పటికీ.. జవాన్ భక్తుడిని సేఫ్ గా ఒడ్డుకి చేర్చగలిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రాణాలకు తెగించి ధైర్య సాహసాలతో భక్తుడిని కాపాడిన జవాన్ పై ప్రశంసలు వెల్లువెత్తాయి. దేవుడిలా వచ్చి భక్తుడిని కాపాడాడు అంటూ సెల్యూట్ చేస్తున్నారు.

ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి..

https://x.com/uttarakhandcops/status/2082682611789668791

#Jawan Saves Life#Ganga#Noida#Kangra Ghat#Haridwar#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి