తెలంగాణ

Telangana: తెలంగాణలో జోరందుకున్న వానలు.. జలకళ సంతరించుకున్న ప్రాజెక్టులు!

రచన: Venu4 నిమిషాల పఠనం

మొన్నటి వరకూ ఎప్పుడు వర్షం పడుతుందా... పంటలు ఎలా కాపాడుకోవాలా... అని దిగులు చెందిన రైతు గుండెల్లో ఇప్పుడు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జనం చేసిన పూజలు ఫలించాయా?.. కప్పల పెళ్లి తంతుకు వరుణుడు కరుణించాడా? ఏదైతేనేమి.. ఇప్పుడు జోరందుకున్న వానలతో రాష్ట్రం జలసిరులతో అలరారుతోంది..

గత వారం రోజుల క్రితం వరకు ఆకాశం వైపు ఆశగా చూసిన కళ్లే ఇప్పుడు వరుణుడి కరుణ చూసి ఆనందంతో మెరుస్తున్నాయి.. మొన్నటి వరకూ ఎప్పుడు వర్షం పడుతుందా... పంటలు ఎలా కాపాడుకోవాలా... అని దిగులు చెందిన రైతు గుండెల్లో ఇప్పుడు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జనం చేసిన పూజలు ఫలించాయా?.. కప్పల పెళ్లి తంతుకు వరుణుడు కరుణించాడా? ఏదైతేనేమి.. ఇప్పుడు జోరందుకున్న వానలతో రాష్ట్రం జలసిరులతో అలరారుతోంది..

వర్షాకాలం వచ్చి రోజులు గడిచినా ఫర్వాలేదు కానీ ఆలస్యంగా వచ్చిన ఈ వానలు తెలంగాణకు ఊపిరిలా మారాయి. గత మూడు, నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు, ఉపనదులు పరవళ్లు తొక్కుతున్నాయి. తెలంగాణతో పాటు మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

ఆ ప్రవాహంతో రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు మళ్లీ జలకళను సంతరించుకుంటున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం 12 వేల 900 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిల్వ 17.103 టీఎంసీలకు చేరగా, కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో దాదాపు 10 వేల క్యూసెక్కులకు చేరింది.

కడెం ప్రాజెక్టుకు అయితే భారీ వరద పోటెత్తింది. గురువారం ఉదయం 11 గంటలకు ఏకంగా 77 వేల 442 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదుకావడంతో అధికారులు ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మొత్తం 85 గేట్లను ఎత్తి ఉంచారు.

ప్రస్తుతం లక్షా వెయ్యి 530 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, అంతే స్థాయిలో అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. అదేవిధంగా ఎండిపోయిన చెరువులు నిండుతున్నాయి.. వెలవెలబోయిన జలాశయాలు కళకళలాడుతున్నాయి.. ఆందోళనలో ఉన్న రైతు ముఖంలో చిరునవ్వు తిరిగి కనిపిస్తోంది. ఆలస్యంగా వచ్చినా.. ఈ వర్షాలు కేవలం నీటిని మాత్రమే కాదు.. రైతుకు ధైర్యాన్ని, పైరుకు ప్రాణాన్ని, తెలంగాణ నేలకు నూతన జీవాన్ని అందించాయి.

#Telangana#Rains#projects filled#water#Farmers
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి