Ritika Nayak: సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ ని హైడింగ్ లో పెట్టడం, కొన్ని కీలక పాత్రలను రివీల్ చేయకపోవడం మేకర్స్ చేసే ప్రమోషనల్ స్ట్రాటజీలో ఒకటి. అయితే, ఇలాంటి స్ట్రాటజీ వర్కౌట్ అయితే కొందరికి బాగా కలిసి వస్తుంది. కొందరికి మాత్రం లైఫే లేకుండా పోతుంది. ఇలా, జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. రీసెంట్ గా హీరో సుమంత్ కూడా నువ్వే కావాలి, దేశముదురు లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ మిస్ చేసుకున్నానని రివీల్ చేశాడు.
అలాంటి, ఓ ఆసక్తికరమైన సంఘటన యంగ్ బ్యూటీ రితిక నాయక్ ఇప్పుడు రివీల్ చేసింది. ఈ బ్యూటీ ఇండస్ట్రీకి పరిచయమవుతూ చేసిన సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం. విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా రుక్సార్ థిల్లాన్ నటించింది. అందుకే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో, ఇంటర్వ్యూలలో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఆమెనే హైలెట్ చేశారు.
మరో మెయిన్ లీడ్ గా నటించిన రితిక నాయక్ ని మాత్రం ఎక్కడా కనపడనివ్వలేదు. ఆ సమయంలో.. టీవీలో ఈవెంట్స్ చూసి ఎంతో బాధపడిందట. టీమ్ నన్నెందుకు ప్రమోట్ చేయడం లేదని.. తన స్నేహితురాలి వద్ద ఏడ్చినంత పని చేసిందట. కానీ, అసలు విషయం సినిమా రిలీజ్ రోజు తెలిసిందట. థియేటర్స్ లో తన పాత్రకి వచ్చిన రెస్పాన్స్ చూసి ఎంతో ఎగ్జైట్ అయ్యానని చెప్పుకొచ్చింది రితిక.
చిత్రబృందం కావాలనే తనను రివీల్ చేయలేదని తెలుసుకున్నాక, తన పాత్రకి వచ్చిన గుర్తింపు..దాని ద్వారా వచ్చిన హీరోయిన్ అవకాశాలు ఇప్పుడు ఎంతో ఆనందాన్నిస్తున్నాయని తెలిపింది. మిరాయ్ సినిమాలో హీరోయిన్‌గా నటించి క్రేజ్ తెచ్చుకున్న రితిక..ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన కొరియన్ కనకరాజు సినిమాలో నటించింది. ఈ సినిమా ఆగస్టు మొదటి వారంలో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా గనక హిట్ అయితే, రితిక నాయక్ యంగ్ హీరోలకి మంచి ఛాయిస్ అవుతుందనడంలో సందేహమే లేదు.












