Health

Health: ఆడవారికి మద్యం అలవాటు ఉంటే శరీరంలో జరిగే మార్పులు ఇవే!..

రచన: Venu4 నిమిషాల పఠనం

మహిళల శరీరం పురుషులతో పోలిస్తే మద్యాన్ని భిన్నంగా జీర్ణం చేస్తుంది. అందుకే తక్కువ మోతాదులో మద్యం తీసుకున్నా శరీరంపై దాని ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. మొదటగా కాలేయం దెబ్బతింటుంది. ఫ్యాటీ లివర్, లివర్ ఇన్‌ఫ్లమేషన్, సిరోసిస్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఈ రోజుల్లో మద్యం సేవించడం కేవలం పురుషులకే పరిమితం కాదు. కొంతమంది మహిళలు కూడా మద్యం వైపు ఆకర్షితులవుతున్నారు. కానీ అదే అలవాటు నెమ్మదిగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మహిళల శరీరం పురుషులతో పోలిస్తే మద్యాన్ని భిన్నంగా జీర్ణం చేస్తుంది. అందుకే తక్కువ మోతాదులో మద్యం తీసుకున్నా శరీరంపై దాని ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. మొదటగా కాలేయం దెబ్బతింటుంది. ఫ్యాటీ లివర్, లివర్ ఇన్‌ఫ్లమేషన్, సిరోసిస్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు..

ఇక సాధారణంగా మద్యం సేవించడం వల్ల ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. రోజువారీ పనితీరు తగ్గిపోవడంతో పాటు కుటుంబ జీవితంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అదేవిధంగా మహిళల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల నెలసరి సమస్యలు, సంతానోత్పత్తికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తవచ్చు..

గర్భధారణ సమయంలో మద్యం తీసుకోవడం తల్లి ఆరోగ్యానికే కాదు, గర్భంలోని శిశువు ఎదుగుదల, మెదడు అభివృద్ధిపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అందుకే గర్భధారణ సమయంలో మద్యం పూర్తిగా నివారించాలని వైద్యులు సూచిస్తున్నారు.

అంతేకాదు, పరిశోధనల ప్రకారం క్రమం తప్పకుండా మద్యం సేవించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ల ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉందని, రోగనిరోధక శక్తి తగ్గడం, ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

మరోవైపు అప్పుడప్పుడు తీసుకునే మద్యం కూడా కొందరిపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మద్యం అలవాటుకు దూరంగా ఉండటం ఉత్తమం. ఇప్పటికే అలవాటు ఏర్పడి ఉంటే, దానిని మానేందుకు వైద్యులు లేదా కౌన్సిలర్ల సహాయం తీసుకోవడం మంచిదని ఆరోగ్యనిపుణులు అంటున్నారు..

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#Health#woman#alcohol#habit#consuming
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి