- పట్టుభద్రుల ఎన్నికలకు ప్లాన్స్
- విద్యార్ది దశ నుంచే గాందేయవాద భావజాలం ఉండాలి
- అందరి మన్ననలను పొందేలా ఉండాలి
- దూకుడుగా ఉండే యంగ్ లీడర్స్‌పై దృష్టి
- వాక్చాతుర్యం, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికి అవకాశం
- అన్ని అర్హతలు ఉన్న నేతల పేర్లను చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి
- అగస్టులోనే అప్లికేషన్స్ స్వీకరణ, అభ్యర్థుల పేర్లు ప్రకటించి యువతకు దగ్గరయ్యేందుకు సిద్ధం
- 6 ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాలపై స్వేచ్ఛ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి అనాలసిస్ కథనం
దేవేందర రెడ్డి చింతకుంట్ల
9848070809
జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందే ఆరు జిల్లాల్లో పట్టుభద్రుల ఎన్నికలు నెగ్గేందుకు అధికార పార్టీ సిద్దమవుతోంది. ముందుగా సమన్వయ కమిటీలను నియమించారు. వాళ్లు లీడర్స్ నుంచి అప్లికేషన్స్ స్వీకరించి ఆగస్టు చివర్లో అభ్యర్దులను ప్రకటించేందుకు ప్లానింగ్ చేసుకున్నారు.
పట్టుభద్రుల్లో యువత ఓటు తమ వైపే ఉందని నిరూపించుకునేందుకు సీఎం అన్ని కోణాల్లో అచూతూచి అడుగులు వేస్తున్నారు. యువ నాయకులకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వాళ్ల క్వాలిఫికేషన్స్‌ను చూసి పేరున్న లీడర్స్‌ను ప్రొత్సహించాలని మంత్రులకు తెలిపినట్లు సమాచారం.
సీఎం ఇచ్చిన ఆదేశాలు?
1. ఎన్ఎస్‌యూఐ నుంచే కాంగ్రెస్ భావజాలం కలిగి ఉండాలి
2. మీడియాలో నిత్యం ప్రజల సమస్యలపై అవగాహన ఉంటూ ప్రభుత్వ పనులను ప్రచారం చేసే వ్యక్తులను గుర్తించాలి
3. దూకుడుగా ఉంటూ ఏ సబ్జెక్ అయినా అనర్గళంగా మాట్లాడే వారిపై దృష్టి పెట్టాలి
4. పార్టీకి, ముఖ్యమంత్రికి విధేయుడిగా ఉన్న వ్యక్తులకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి
5. సీఎం సొంత జిల్లాతో పాటు హైదరాబాద్ యువత ఓట్లను కొల్లగొట్ట కలిగే వ్యక్తిగత చరిష్మా ఉండాలి
6. అనిల్‌ను ఎంపీ, బల్మూరిని ఎమ్మెల్సీ చేసినట్లు ఎన్నికల రంగంలో కూడా అలాంటి వారిని నిలిపి గెలిపించేలా ప్లాన్ చేయాలి
7. గతంలో పోటీ చేయని యువ నేతలకు ప్రాధాన్యత
ఎంపిక విషయాల్లో తిసభ్య కమిటీ
మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కలిసి జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో, ఎమ్మెల్యేలతో విస్తృతంగా చర్చించి ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ ద్వారా అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు గెలుపు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కత్తిలాంటి కుర్రోళ్లను గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్‌కు అవకాశం ఇచ్చేందుకు అర్హత ఏంటో చెక్ లిస్ట్‌గా పెట్టుకుని త్రిసభ్య కమిటీ నివేదిక ఇవ్వనుంది.












