స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Bommarasipet lands: బొమ్మరాసిపేట్ భూముల్లో బినామీల దందా?

రచన: Swechaanews Chairman11 నిమిషాల పఠనం

నా వయస్సు 78 ఏండ్లు. నాకు తెలియని మీడియా లేదు. నేనే పెద్ద మీడియా. నాకంటే పెద్ద పొలిటిషన్ ఎవడు. నేనే అందరిపై ఫైట్ చేశానని నోరు నెత్తిన పెట్టుకుని ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా ఊగిపోయే వెలమ దొర చేసిన అమెరికా పర్యటనలతోనే ఈనాడు బొమ్మరాసిపేట్‌లో భూ మాఫియా పేట్రేగిపోతోందనే ఆరోపణలు ఉన్నాయి.

  • ఆనాడు బంధువుల పేర్లపై ఎక్కించిన ఎంపీ

  • ఈనాడు నేతల అనుచరుల పేర్లతో అగ్రిమెంట్లు?

  • రెవెన్యూలో ఎక్కడా దొరకని ఆర్డీవో ఆర్డర్‌తో వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్న వైనం

  • అగ్రిమెంట్ల రూపంలో వందల కోట్ల మనీ లాండరింగ్?

  • తక్కువ ధరకు వస్తుంది కదా అని కొనుగోలు చేస్తే కోర్టు స్టేలతో ఇరుక్కుపోవడం ఖాయం

  • ఇప్పటి వరకు పొజిషన్‌లో లేకుండానే 90 ఎకరాలకు పాస్ బుక్‌లు ఇప్పించిన కాంగ్రెస్ పెద్దలు

  • హైకోర్టు నుంచి స్టేటస్ కో తెచ్చుకుంటున్న పట్టాదారులు

  • తాజాగా మరో 82 ఎకరాలకు గాను 40 మందికి నోటీసులు

  • 30 ఏండ్లుగా పట్టా, పాస్ బుక్‌లు ఉన్నా.. కోర్టులో కేసులు కొనసాగుతున్నా..

  • దోపిడీ ముఠాగా ఏర్పడి బరితెగించి రికార్డులు మార్చుకుంటున్న తీరుపై స్వేచ్ఛ న్యూస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి డీటెయిల్డ్ కథనం పార్ట్-2

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్,

9848070809

నోరు నెత్తిన పెట్టుకునే ఆ నేతతోనే ప్రారంభమైయిందా?

నా వయస్సు 78 ఏండ్లు. నాకు తెలియని మీడియా లేదు. నేనే పెద్ద మీడియా. నాకంటే పెద్ద పొలిటిషన్ ఎవడు. నేనే అందరిపై ఫైట్ చేశానని నోరు నెత్తిన పెట్టుకుని ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా ఊగిపోయే వెలమ దొర చేసిన అమెరికా పర్యటనలతోనే ఈనాడు బొమ్మరాసిపేట్‌లో భూ మాఫియా పేట్రేగిపోతోందనే ఆరోపణలు ఉన్నాయి. మూడు పార్టీలు తన జేబులోనే ఉన్నాయని బిల్డప్ ఇచ్చే ఈయన, కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీతో చేతులు కలిపి సెలబ్రెటీ రిసార్ట్స్‌లో కూర్చొని రైతుల భూములకు ఆనాడు స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఆ తీన్మార్‌తో పని అయ్యేలా లేదని ఉప్పల్, మేడ్చల్ కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కు అయి ఎప్పుడూ రెవెన్యూ అధికారుల వద్ద లేని ఏ2/2183/1999 ఆర్డర్‌ను ఓనర్ వద్ద ఉన్న తీర్పు అంటూ అప్‌లోడ్ చేసిన పత్రాన్ని పట్టుకుని తిరుగుతున్నారు. పీటీ 50బీ పట్టాలను రద్దు చేసినట్లు చెప్పుకుంటూ, పొజిషన్‌లో లేకుండా నాలా కన్వర్షన్ చేసిన భూములను కూడా భూ భారతిలో ఎక్కించుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ సర్కార్‌లోనే ధరణి ఉన్నప్పుడు ఐటీసీ కంపెనీకి చెందిన 50 ఎకరాలకు రికార్డులు మార్చారు. ఐటీసీ కంపెనీ హైకోర్టులో రిట్ పిటిషన్(నెం.24502 ఆఫ్ 2025)తో స్టేటస్ కో ఆర్డర్ తెచ్చుకుంది. తాజాగా 2026 జూలై 10న మరో 40 ఎకరాలను మార్చుకున్నారు. దుగ్గిరాల యుగేంధర్ బాబు పేరు మీదకు 20 ఎకరాలు, మరి కొంతమందికి మరో 20 ఎకరాలకు పాస్ బుక్‌లు ఇచ్చారు. పొజిషన్ లేకుండానే తమ సర్వే నెంబర్స్ రికార్డులు మార్చారని పినాకిల్ గ్రూప్ కంపెనీ హైకోర్టుకు వెళ్లి స్టే(రిట్ పిటిషన్ నెంబర్ 24882/2026) తెచ్చుకుంది. ఇలానే మళ్లీ 40 మంది పట్టాదారులకు 82 ఎకరాలకు గాను శామీర్ పేట్ ఎమ్మార్వో నోటీసులు జారీ చేశారు.

ఎవరు ఈ దుగ్గిరాల ఫ్యామిలీ?.. రూ.10 వేల కోట్ల ప్రాపర్టీపై కన్ను?

గుడివాడ ఎంపీగా పని చేసిన దుగ్గిరాల బలరామకృష్ణయ్య ఆనాడే బినామీ పేర్లతో 1,049 ఎకరాలు 20 మంది బందువుల పేర్ల మీద కొనుగోలు చేశారు. దుగ్గిరాల అమరేంద్ర బాబుతో పాటు 20 మందికి 436/1965, 437/65 రెండు డ్యాకుమెంట్ల ద్వారా కొనుగోలు చేశారు. 1966లో పార్టీషన్ డీడ్(207/1966) చేసుకున్నారు. దీంతో వీరంతా రికార్డుల్లోకి ఎక్కారు. భూ సంస్కరణల పేరుతో వచ్చిన చట్టాలతో వీరు ఇటు వైపు చూడలేదు. దీనికి తోడుగా ఇనాం ల్యాండ్ 255 ఎకరాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించి 1973లో ఎవరు పొజిషన్‌లో ఉన్నారో వారికి ఓఆర్సీ ఇచ్చింది. మిగితా పట్టా ల్యాండ్‌లో ఆనాడే పొజిషన్ ఉన్న భూమికి పీటీ యాక్ట్ ప్రకారం 38 వర్తించకపోవడంతో 50బీ కింద ఆనాటి ఎమ్మార్వో పట్టాలు ఇష్యూ చేశారు. ఇలా రెవెన్యూ రికార్డుల్లో అందరి పేర్లు మారిపోయాయి. కొందరు సాదా బైనామా ద్వారా తక్కువ ధరకే అమ్ముకుని వెళ్లిపోయారు. సీలింగ్ యాక్ట్ తప్పించుకునేందుకు ఈ దుగ్గిరాల కుటుంబం మొత్తం రైతులకు అమ్మడంతో పాటు రికార్డులు మార్చినా పట్టించుకోలేదు. 1989లో ఆర్వోఆర్ యాక్ట్ వస్తే 1981లో ఎలా మార్చుతారని 1998లో ఆర్డీవో వద్ద కేసు వేశారు. 1981లో పీటీ యాక్ట్‌లోని సెక్షన్ 50బీ కింద పట్టాలు ఇవ్వడం జరిగిందనే అంశాన్ని దాచి పెట్టి ఆర్వోఆర్ యాక్ట్ మాత్రమే చెబుతూ నేతలతో రాయబారం చేసి రైతుల వద్ద నుంచి భూములు కొట్టేయాలని చూస్తున్నారు.

ఆర్డీవోకు ఆ అధికారం ఉందా?.. అంబర్ పేట్‌లో ఆయనను కలిస్తే ఏమన్నారు?

రంగారెడ్డి ఈస్ట్ ఆర్డీవో ఏ2/2138/1999 ద్వారా ఎమ్మార్వో 50బీ లను రద్దు చేశారని చెబుతున్నారు. ఒక్కసారి ఎమ్మార్వో టెనెన్సీ యాక్ట్ ద్వారా పట్టాలు ఇష్యూ చేస్తే రద్దు చేసే అధికారం కలెక్టర్‌కే ఉంటుంది. ఇప్పుడు ఆ ఆర్డర్ ఎక్కడ, గత 20 ఏండ్లుగా ఆర్టీఐలో అడుగుతున్నా అందుబాటులో లేదని చెబుతున్నారు. అంబర్ పేట్‌లో 82 ఏండ్ల వయసు ఉన్న ఆర్డీవో వద్దకు రైతులు వెళ్లారు. ఈ తీర్పు తాను ఇవ్వలేదని, ఆనాటి ఎమ్మార్వోతో మాట్లాడి స్పష్టం చేశారు. అది ఎన్నికల ఏడాది. అప్పుడు ఇలాంటి ఫైల్స్ ముట్టుకుని ఉత్తర్వులు ఇచ్చే అవకాశమే లేదని తేల్చారు. కానీ, ఈ వయసులో తాను కోర్టులకు రాలేనని తెలపడంతో రైతులు కూడా ఆ ఆర్డీవోని ఇబ్బంది పెట్టలేదు. ఇలా 2007 నుంచి వాళ్లకు భూమి ఉందని చెప్పుకుంటూ తిరిగిన కొంతమంది వెలమ దొరలు బీఆర్ఎస్ హయాంలో రైతుల వద్ద నుంచి కొట్టేయాలని పక్కా ప్లాన్ వేశారు. కేసీఆర్ ఆ ఫైల్ ముట్టొద్దని 400 మంది రైతులకు న్యాయం చేసేలా ఉండాలని చెప్పడంతో ఆగిపోయారు. కాంగ్రెస్ రాగానే ఆరు నెలలుగా చేసిన ఎమ్మెల్యే గిరి, నిత్యం ఏదైనా మాట్లాడతాను అనుకుంటూ అయిన పరిచయాలతో క్లియర్ చేయించుకుంటునట్లు సమాచారం. ఉప్పల్‌లో ఓ రెడ్డి లీడర్, మేడ్చల్‌లో యాదవ కాంగ్రెస్ నేతలతో చేతులు కలిపి అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇటీవల ఓ అధికారి అత్యాశకు వెళితే ఏసీబీకి పట్టించారని శామీర్ పేట్‌లో టాక్.

మనీ లాండరింగ్‌కు పునాదులు?.. ఈడీకి ఫిర్యాదు చేసేందుకు రెడీ

బినామీల రూపంలో ఓఆర్ఆర్‌కు ఆనుకుని ఉన్న భూములు తక్కువకు వస్తున్నాయి, పొజిషన్ లేకుండానే పాస్ బుక్‌లు వచ్చినా ఎప్పటికైనా అవి మనకే దక్కుతాయని చెబుతూ వందల కోట్ల బినామీ ట్రాన్స్‌ఫర్స్ జరుగుతున్నాయి. వారసుల పేర్ల మీదకు రికార్డుల మార్పు పేరుతో ఇప్పటికే ఎన్నో నాలా కన్వర్షన్ అయిన భూములను సైతం ప్రభుత్వానికి దమ్మిడి ఆదాయం లేకుండానే రూ.వేల కోట్ల భూములను రికార్డులు మార్చేస్తూ కుట్రలు పన్నుతున్నారు. కోర్టుల్లో స్టే రావడంతో అటు పెట్టుబడి పెట్టిన వారు సైతం, అగ్రిమెంట్ల రూపంలో 4 ఏండ్లుగా అటూ ఇటూ కాకుండా మధ్యలో ఇరుక్కుపోయిన వారు ఉన్నారు. ఇలా ఈ నేతల మాటలతో వ్యాపారులు మోసపోతున్నారు. దేనికైనా లిమిటేషన్ పిరియడ్ ఉంటుంది. 30 ఏండ్లకు పైగా రెవెన్యూ రికార్డులు మారినా ఇప్పుడు ఈ భూమంతా తమదే అంటూ అమెరికా నుంచి వచ్చి దోపిడీ దొంగల్లా దొచుకునేందుకు రెడీ అయితే ప్రభుత్వ పెద్దలు సహకరిస్తుంటే దీన్ని దారి దోపిడీ అనాలా? విచ్చలవిడిగా దోచుకోవడం అనాలా? అని ఈ భూములు కొనుగోలు చేసిన రైతులు బాధ పడుతున్నారు. న్యాయం జరగకపోతే ఎంతటి దూరమైనా వెళతామని చెబుతున్నారు.

#Bommarasipet Land Scam#Benami Land Deals#Telangana Land Mafia#Revenue Records Manipulation#Property Fraud#Money Laundering Investigation#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి