సినిమా

Varun Tej: మటన్, చికెన్, పీతలు, రొయ్యలు..ఇవి లేకుండా రోజు గడవదా!

రచన: Anshu3 నిమిషాల పఠనం

Varun Tej: సాధారణంగా సినీ తారలంటే క్రమం తప్పకుండా వ్యాయామం, కంట్రోల్డ్ డైట్ తప్పనిసరి. ఒక్కో హీరో ఒక్కో రకమైన డైట్ ని ఫాలో అవుతుంటారు. ఫిజికల్ ట్రైనీ, డైటీషియన్ సలహాల మేరకే తమ రోజు వారీ కార్యక్రమాలు సాగుతుంటాయి. మహేష్ బాబు ఏది తిన్నా కొద్ది కొద్దిగా తింటాడు. ముఖ్యంగా మిల్క్ ప్రాడెక్ట్స్ జోలికి, మసాలా జోలికి వెళ్ళడు.

ప్రభాస్ మంచి ఫుడీ. అయినా, సినిమా కోసం చాలా కఠినంగా డైట్ ఫాలో అవుతాడు. ఇక, నాగార్జున వారమంతా రెగ్యులర్ డైట్ పాటించినప్పటికీ..ఒక్క ఆదివారం మాత్రం తనకి నచ్చినట్టుగా తింటాడు. అలా, మిగతా హీరోలు డైట్ విషయంలో చాలా పద్ధతులను పాటిస్తుంటారు. కానీ, వరుణ్ తేజ్ వీరందరికంటే పూర్తిగా భిన్నం.

ఒక్కరోజు కూడా నాన్ వెజ్ లేకుండా భోజనం చేయడట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఆయనే చెప్పుకొచ్చాడు. ఖచ్చితంగా ప్రతీరోజూ మటన్, చికెన్, రొయ్యలు, పీతలు..ఇలా ఏదో ఒక నాన్-వెజ్ ఐటం ఉండాలిందే. ఈ విషయంలో అసలు కాంప్రమైజ్ కాడట. చిన్నతనంలో చికెన్ వండి పెట్టలేదని, ఆ రోజుంతా భోజనం చేయకుండా ఏడుస్తూ కూర్చున్నాడట.

తర్వాత రోజు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడట. ఇలాంటి, మొడితనం నాన్-వెజ్ విషయంలో వరుణ్ తేజ్‌ది. జూనియర్ ఎన్‌టిర్ కూడా ప్రతీ రోజూ ఏదో ఒక పూట నాన్-వెజ్ ఉండాల్సిందేనని చెప్పాడు ఓ సందర్భంలో. ఇక, వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా కొరియన్ కనకరాజు ఆగస్టు 7వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇండో కొరియన్ హర్రర్-కామెడీ జానర్ లో మేర్లపాక గాంధీ తెరకెక్కించాడు. రితిక నాయక్ హీరోయిన్‌గా నటించింది.

#VarunTej#VarunFoodHabits#KoreanKanakaraju#MerlapakaGandhi#RithikaNayak
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి