సినిమా

Rakul Preeth Singh: రామాయణ మూవీలో శూర్పణఖ..సీతనే డామినేట్ చేసిందా!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Rakul Preeth Singh: తాజాగా, భారీ మైథలాజికల్ మూవీ రామాయాణ నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఎన్నో సినిమాలు రామాయాణాన్ని ఆధారంగా చేసుకొని వచ్చాయి. వాటిలో, కొన్ని ఊహాజనితంగానూ రూపొందాయి. అయితే, అప్పట్లో వచ్చిన రామాయణ కథలకే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు తప్ప..ఇప్పటి, సినిమాలకి అంతగా ఆకర్శితులవడం లేదు.

Rakul Preeth Singh: తాజాగా, భారీ మైథలాజికల్ మూవీ రామాయాణ నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఎన్నో సినిమాలు రామాయాణాన్ని ఆధారంగా చేసుకొని వచ్చాయి. వాటిలో, కొన్ని ఊహాజనితంగానూ రూపొందాయి. అయితే, అప్పట్లో వచ్చిన రామాయణ కథలకే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు తప్ప..ఇప్పటి, సినిమాలకి అంతగా ఆకర్శితులవడం లేదు.

దీనికి, కారణం మరీ వీఎఫెక్స్ ఎక్కువై, ఒరిజినాలిటీ అనిపించకపోవడమే. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లాంటి హీరో..ఓం రౌత్ లాంటి అగ్ర దర్శకుడు కలిసి చేసిన ఆదిపురుష్ ఎలాంటి ఫలితాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. అయినా, కూడా ఇదే కథను పట్టుకొని ఇంకొదరు ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి, ప్రయోగం చేస్తున్న దర్శకుడు నితీష్ తివారీ.

గత కొన్ని నెలలుగా అందరూ మాట్లాడుకుంటుంది రామాయణ సినిమా గురించే. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించడానికి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో, ప్రధానంగా హనుమంతుడి పాత్రను అసలు చూపించలేదు. అలాగే, సీత పాత్ర పోషిస్తున్న సాయి పల్లవిది పార్ట్ 1 స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉంటుందనే భావన కలిగించారు.

ముఖ్యంగా, సీత గా నటిస్తున్న సాయి పల్లవి కంటే శూర్పణఖ పాత్రలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ బాగా ఆకట్టుకుంది. లుక్స్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా మంచి బలమైన రోల్ దొరికిందంటున్నారు. ఆ పాత్రకు రకుల్ సరిగ్గా సరిపోయిందని ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ, సాయి పల్లవి కి మాత్రం పెద్దగా పేరు రాలేదు. తన పాత్ర చాలా పేలవంగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరి, సినిమాలో ఎలా ఉంటుందో గానీ..ట్రైలర్ వరకూ చూసుకుంటే సాయి పల్లవిని మించి రకుల్ ఎక్కువ మార్కులు కొట్టేసింది. కాగా, ఈ సినిమాలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యష్ నటించారు. రణ్‌బీర్ కంటే కూడా యష్ పాత్ర చాలా బలంగా ఉందని, పర్ఫార్మెన్స్ ఊహించని విధంగా ఉందని మాట్లాడుకుంటున్నారు.

#SaiPallavi#RakulPreethSingh#Ramayana#Ranbeerkapoor#Yash
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి