Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరోలలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గత కొంతకాలం నుంచి వరుసగా సినిమాలను చేస్తూ వస్తున్నాడు. అంతేకాదు, సీనియర్స్ లో బాలయ్య వరుస విజయాలను అందుకున్నాడు. గత చిత్రం అఖండ 2 కూడా అనుకున్న సమయానికి గనక విడుదలై ఉంటే అది కూడా పెద్ద కమర్షియల్ సక్సెస్ ని సాధించి ఉండేది.
కానీ, నిర్మాతలకి గతంలో ఉన్న బకాయిల వల్ల విడుదల ఆగిపోవడం..ఆ ప్రభావం అఖండ 2 సక్సెస్ మీద గట్టిగా పడటం జరిగిపోయాయి. అయినా, బాలయ్యకి ఎలాంటి గ్యాప్ లేదు. వరుసగా రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు. వాటిలో, ఒకటి గోపీచంద్ మలినేని తో చేస్తున్న సినిమా, మరొకటి కొరటాల శివతో చేస్తున్న సినిమా. ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనాల్సి ఉంది.
ఆల్రెడీ ఎన్‌బికె 111 షూటింగ్ లో బాలయ్య జాయిన్ అయ్యాడు. కాకినాడ పోర్ట్ లో లాంగ్ షెడ్యూల్ జరుగుతోంది. భారీ యాక్షన్స్ సీన్ తెరకెక్కిస్తున్న సమయంలోనే బాలయ్యకి గట్టిగా దెబ్బ తగిలింది. అది, చిన్నదే..వారం పది రోజుల్లో తిరిగి షూటింగ్ లో జాయిన్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ, తాజా సమాచారం మేరకు..బాలయ్యకి గట్టి దెబ్బే తగిలిందట. పెద్ద సర్జరీనే జరిగిందని, రెండు నెలలపాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సూచించారు.
దాంతో, అక్టోబర్ వరకూ ఏ షూటింగ్‌లో పాల్గొనలేడని క్లారిటీ వచ్చింది. ఆగస్టు చివరి వారం మళ్ళీ ఎక్స్‌రే, స్కానింగ్ తీసిన తర్వాత గాయం పూర్తిగా నయం అయిందంటేనే అక్టోబర్ నుంచి సెట్స్‌లో అడుగుపెడతాడట. ఈ లోపు అటు కొరటాల ఇటు గోపీచంద్ మలినేని బాలయ్య లేని సీన్స్ ని, మిగతా ఆర్టిస్టులపై సన్నివేశాలను కంప్లీట్ చేసేలా రీ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి రావాలనుకున్న బాలయ్య 111వ సినిమా ఆలస్యం అయ్యేలా ఉంది.












