తెలంగాణ

Hyderabad : త్వరగా లాగౌట్ చేయండి.. టెకీలకు పోలీసుల సూచన

రచన: Kumar3 నిమిషాల పఠనం

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.గత రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగాయి.ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయంలో, సాయంకాలం ఆఫీసులు ముగిసాక ఉద్యోగులు ఇంటికి వెళ్లేసయంలో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో నగర ట్రాఫిక్ పోలీసులు ఐటీ కంపెనీలకు కీలక విజ్ఞప్తి చేశారు.

నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వర్షాల కారణంగా రోడ్లపై ట్రాఫిక్ స్తంభించకుండా, ఐటీ ఉద్యోగులు సురక్షితంగా ఇంటికి చేరుకునేందుకు వీలుగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనరేట్ కీలక సూచనలు చేసింది.సైబరాబాద్ పరిధిలోని ఐటీ కంపెనీలు, ఇతర ప్రైవేట్ సంస్థలు వీలైనంత వరకు తమ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించాలని కోరింది.

ఆ సదుపాయం కల్పించేని కంపెనీలు .. ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ట్రాఫిక్ చిక్కులు తప్పేలా గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచే విడతల వారీగా ముందస్తు లాగౌట్ కోసం అనుమతి ఇవ్వాలని సంస్థలను కోరింది.అలా చేయడం వలన ఒకవేళ సాయంత్రం వర్షం తీవ్రంగా ఉన్నా.. ట్రాఫిక్ చిక్కులు కాస్త తగ్గే చాన్స్ ఉంది. ఒకే సమయంలో అందరూ ఒకేసారి రోడ్లపైకి వస్తే ఐటీ కారిడార్ (మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో) తీవ్ర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడి గంటల తరబడి వాహనదారులు ఇబ్బందులు పడాల్సి రావొచ్చని ముందే హెచ్చరించింది.అందుకే విడతల వారీగా లాగౌట్‌కు అనుమతులు ఇవ్వాలని పోలీసులు సూచించారు.

#cyberabad commissionarate#traffic issues#early lagot#IT companiees
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి