నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. దానికి ముందు పార్లమెంట్ మార్చ్‌కు సీజేపీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈనెల 20న జరిగిన ఈ ఘటనలో పెద్దఎత్తన నిరసన కార్యక్రమం జరిగింది. అదే సమయంలో పలువురు నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ జరిపారు.పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారడం, కొందరు ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీచార్జ్‌తో పాటు పెల్లెట్ గన్స్ఉపయోగించారు.
విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో కేంద్రంపై తీవ్రవిమర్శలు గుప్పించారు.విద్యార్థుల మీద పెల్లెట్ గన్స్ ఎలా వాడుతారని, కాల్పులు జరపాలని కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆదేశాలు ఇచ్చారని.. ఆయన, మోడీ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.నీట్‌పై చర్చ సందర్బంగా అధికార,ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎట్టకేలకు ఆందోళనల మధ్యే యాంటీ పేపర్ లీకేజీ బిల్‌ను కేంద్రం ఆమోదించింది.
అయితే, జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్ వాడకంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. నిరసనకారులపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాడిన మందుగుండు సామగ్రి రికార్డులను భద్రపరచాలని కేంద్రాన్ని న్యాయస్థానం ఆదేశించింది.పెల్లెట్ గన్స్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ మాజీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్‌తో పాటు మరో ఇద్దరు బాధితులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వాడే అధికారం పోలీసులకు ఉందని పేర్కొంది.గాయపడిన బాధితులకు అత్యుత్తమ చికిత్స అందించాలని ఆదేశించింది.












