క్రైమ్

Viral : 12 గంటలు ఆలస్యం.. బెడిసికొట్టిన ‘సజీవసమాధి’స్టంట్ (వైరల్)

రచన: Kumar3 నిమిషాల పఠనం

పొట్టకూటి కోసం, సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొందరు కొన్ని స్టంట్స్ వేస్తుంటారు. అసాధ్యం కానిది ఏది ఉండదంటూ దానిని మేం సుసాధ్యం చేసి చూపుతామని కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు.

పొట్టకూటి కోసం, సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొందరు కొన్ని స్టంట్స్ వేస్తుంటారు. అసాధ్యం కానిది ఏది ఉండదంటూ దానిని మేం సుసాధ్యం చేసి చూపుతామని కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు.అలాంటి ఘటనే ఒకటి హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ వ్యక్తి తనను తాను సజీవ సమాధి చేసుకుంటానని స్థానిక ప్రజలను నమ్మించాడు. 24 గంటల తర్వాత సమాధిని తవ్వి చూడాలని సవాల్ విసిరారు.

అనుకున్నట్టుగానే తనను తాను సజీవ సమాధి చేసుకున్నాడు. 24 గంటల తర్వాత చూస్తే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటన హర్యానాలో సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టినట్టు సమాచారం. వివరాల్లోకివెళితే.. హర్యానాలోని నూహ్ జిల్లా తౌరు సబ్‌డివిజన్ పరిధిలోని ఖోరీ కలాన్‌లో సంచార సర్కస్ బృందానికి చెందిన దీపక్ (27) అనే వ్యక్తి ‘సజీవ సమాధి’ స్టంట్ చేశాడు.

ఓ సంచిలో దీపక్‌ని బంధించి, సజీవ సమాధి కోసం తవ్విన గుంతలోకి దించి దాన్ని కప్పేశారు. 24 గంటల తర్వాత అతడ్ని సజీవంగా బయటకు తీస్తామని సర్కస్‌ నిర్వాహకులు చెప్పారు.కానీ, మరో 12 గంటలు ఆలస్యంగా, అంటే 36 గంటల తర్వాత బయటకు తీయగా, అతను చనిపోయాడు. ఎక్కువసేపు సమాధిలో ఉండటం వల్ల.. ఊపిరాడక దీపక్ చనిపోయినట్టు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

https://x.com/pulsenewsbreak/status/2082637047093985679?s=20

#Live burial#stunt#sarcus man dead#haryana#national
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి