సినిమా

‘శ్రీనివాస మంగాపురం’ రివ్యూ.. ఘట్టమనేని వారసుడు హిట్ కొట్టాడా?

రచన: Anshu5 నిమిషాల పఠనం

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో వారసుడు టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమైన తాజా చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో జయకృష్ణ సక్సెస్ అందుకున్నారా? లేదా? అన్నది ఇప్పుడు చూద్దాం.

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో వారసుడు టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమైన తాజా చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో జయకృష్ణ సక్సెస్ అందుకున్నారా? లేదా? అన్నది ఇప్పుడు చూద్దాం.

కథ ఏంటంటే..

ఇది పూర్తిగా ఒక పాత కాలపు ఫ్యాక్షన్, ఊరు బ్యాక్‌డ్రాప్ లవ్‌స్టోరీ. రెడ్డి నాయుడు కుటుంబాల మధ్య జరిగే ఆధిపత్య పోరు, కక్షలు కార్పణ్యాల నడుమ కథ నడుస్తుంది. ఇలాంటి కక్షల వాతావరణంలోనే హీరో హీరోయిన్లు ఒకరినొకరు ఇష్టపడతారు. ఈ ప్రేమ ప్రయాణంలో వారు ఎదుర్కొన్న అడ్డంకులు ఏమిటి? చివరకు తమ కుటుంబాలను ఎదిరించి ఎలా ఒక్కటయ్యారు? అనే రెగ్యులర్ పాయింట్‌ చుట్టూ ఈ సినిమాను అల్లారు.

‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో విభిన్నమైన కథలను, ఊహించని ట్విస్టులను అందించిన అజయ్ భూపతి ఈసారి మాత్రం పూర్తిగా సేఫ్ గేమ్‌ ఆడే ప్రయత్నం చేశారు. అయితే, ఇది ఒక హీరో లాంచింగ్ మూవీ కావడంతో కథ కంటే కమర్షియల్ హంగుల మీదే ఆయన ఎక్కువ దృష్టి పెట్టారు. సినిమా ప్రారంభం నుంచి హీరో ఎంట్రీ ఫైట్, వెంటనే ఒక పాట, ఆ తర్వాత హీరోయిన్‌తో లవ్ ట్రాక్.. ఇలా రొటీన్ కమర్షియల్ ఫార్మాట్‌లోనే ఫస్ట్ హాఫ్ సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ పర్వాలేదనిపించినా, సెకండ్ హాఫ్‌లో మోహన్ బాబు పాత్ర సినిమాకు కొంత బలాన్నిచ్చినప్పటికీ, కథ మాత్రం పాత బాటలోనే నడవడంతో ఆడియన్స్‌కు కొత్తదనం లోపించిన అనుభూతి కలుగుతుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్

డెబ్యూ హీరో అయిన జయకృష్ణ లుక్స్ పరంగా, డాన్సుల పరంగా బాగానే మేనేజ్ చేశారు. నటన పరంగా తొలి సినిమా అయినప్పటికీ డీసెంట్ మార్కులు కొట్టేశారు. రాషా తడాని తన తొలి చిత్రంతోనే స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇక సీనియర్ నటుడు మోహన్ బాబు రోల్ నిడివి తక్కువైనప్పటికీ, తనదైన స్క్రీన్ ప్రిజెన్స్‌తో సినిమాకు హైలైట్‌గా నిలిచారు. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా సినిమాకు ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. అయితే మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ పర్వాలేదనిపించినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్‌లో ట్రిమ్ చేయాల్సిన సీన్స్ చాలానే ఉన్నాయి. స్క్రీన్ ప్లే రొటీన్‌గా సాగడంతో తర్వాతి సీన్ ఏంటనేది ప్రేక్షకులు సులభంగా ఊహించగలరు.

ఫైనల్‌గా..

ఘట్టమనేని వారసుడిగా జయకృష్ణలో మంచి కమర్షియల్ హీరో లక్షణాలు కనిపిస్తాయని ఈ సినిమా నిరూపించింది. అయితే దర్శకుడు అజయ్ భూపతి ఇంకా బలమైన కథను ఎంచుకుని ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. పెద్దగా అంచనాలు ఏవీ పెట్టుకోకుండా, వీకెండ్‌లో టైమ్ పాస్ కోసం థియేటర్‌కు వెళ్తే ఒకసారి ఓపికగా చూడదగ్గ చిత్రమే ఈ ‘శ్రీనివాస మంగాపురం’.

#SrinivasaMangapuram#AjayBhupathi#JayaKrishna#RashaThadani#SrinivasaMangapuramReview
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి