సినిమా

Prabhas-Yash: మీలా మిగతా హీరోలు ఉంటే వందల కుటుంబాలకి తిండి, బట్ట..

రచన: Anshu4 నిమిషాల పఠనం

Prabhas-Yash: ఎప్పుడైతే మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమా అనే మాట, కల్చర్ మొదలైందో అప్పటి నుంచి మన స్టార్స్ నుంచి కనీసం రెండేళ్ళకి ఒక సినిమా కూడా రావడం గగనం అవుతోంది. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి నుంచి ఇది మొదలైంది. అంతకముందు ఆయన సినిమాలు ఫాస్ట్ గానే వచ్చేవి. కానీ, బాహుబలి నుంచి ఏ సినిమాకి ఎన్నేళ్ళు పడుతుందో క్లారిటీ లేదు. వాస్తవానికీ, ఎన్నో ఏళ్ళ క్రితం కూడా బహుభాషా చిత్రాలొచ్చాయి. కానీ, ఇన్నేళ్ళ సమయం పట్టలేదు.

ఆ తర్వాత, ప్రశాంత్ నీల్ కూడా ఇదే తరహాలో సినిమాను సాగదీస్తున్నాడు. ప్రభాస్ తో సినిమా అంటే కనీసం రెండు-మూడేళ్ల సమయం పడుతుందనే వాళ్ళు. ఇప్పుడు,ఏ హీరో సినిమా అయినా ఇలా రెండేళ్ళు సమయం తీసుకుంటున్నారు దర్శకులు. ఎందుకు అంటే క్వాలిటీ, పాన్ ఇండియా సినిమా అంటున్నారు. నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తోన్న ది ప్యారడైజ్ సినిమా మొదలై రెండేళ్ళు అవుతోంది.

ప్రభాస్-హను రాఘవపూడి చేస్తున్న ఫౌజీ సినిమాది ఇదే పరిస్థితి. మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర సినిమా రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. నిఖిల్ లాంటి మిడ్ రేంజ్ హీరోలు చేస్తున్న సినిమాలు అంతే అవుతున్నాయి. ఇప్పుడున్న దర్శకుల్లో ఏడాదికొక సినిమా రిలీజ్ చేస్తుంది ఒక్క అనిల్ రావిపూడి మాత్రమే కనిపిస్తున్నాడు. మల్టీస్టారర్ అయినా బాలయ్య, చిరు లాంటి పెద్ద హీరోలతోనైనా వన్ ఇయర్ లో బొమ్మ పడిపోతోంది.

అయితే, ఇంత గ్యాప్ లేకుండా ప్రభాస్, కన్నడ స్టార్ హీరో యష్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది ప్రభాస్ ది రాజాసాబ్ తో, యష్ కాంతార 1తో వచ్చారు. ఇదే ఏడాది దీపావళికి రామాయణ వస్తోంది. ఇందులో, యష్ రావణాసుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక, డిసెంబర్ లో ఫౌజీ చిత్రాన్ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు డార్లింగ్. ఇలా, ఏడాదికి రెండు సినిమాలు గనక వచ్చేలా మన హీరోలు ప్లాన్ చేసుకుంటే వందల కుటుంబాలకి ఎలాంటి కరువుండదు. మిగతా హీరోలు కూడా కనీసం సంవత్సరానికి ఒక్క సినిమానైనా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటే బావుంటుంది.

#prabhas#yash#fauzi#ramayana#hanuraghavapudi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి